కూకట్‌పల్లి JNTU వద్ద టెన్షన్.. టెన్షన్.. ABVP నాయకులు అరెస్ట్ (వీడియో)

by Shyam |   ( Updated:2023-05-20 15:28:55.0  )
కూకట్‌పల్లి JNTU వద్ద టెన్షన్.. టెన్షన్.. ABVP నాయకులు అరెస్ట్ (వీడియో)
X

దిశ, కూకట్‌పల్లి : JNTU Phd అడ్మిషన్లలో జరిగిన అక్రమాలపై తక్షణమే విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు బుధవారం యూనివర్సిటీ వీసీ భవనాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా, రిజర్వేషన్లు పాటించకుండా ఇష్టారీతిన అడ్మిషన్లు కేటాయించడం సిగ్గు చేటు అని, SC కేటగిరి సీట్లను ఓసీలకి, మహిళా కేటగిరి సీట్లను పురుషులకు కేటాయించినట్టు తెలిపారు.

అంతేకాకుండా నెట్, సెట్ వంటి ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారిని కాకుండా అర్హత లేని వారికి సీట్లను కేటాయించడం యూనివర్సిటీ అధికారుల అవినీతికి పరాకాష్ట అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీసీ, రిజిస్ట్రార్ జరిగిన అక్రమాలపై తక్షణమే సంజాయిషీ ఇవ్వాలని, నోటిఫికేషన్ రద్దు చేసి అర్హులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వీసీ చాంబర్‌లోకి దూసుకెళ్తున్న విద్యార్థి నాయకులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో విభాగ్ సంఘటన కార్యదర్శి కాయం నవేంద్ర, విభాగ్ కన్వీనర్ వినోద్ హిందుస్థానీ, JNTU నాయకులు నాగరాజు, ధీరజ్, రిత్విక్, రోషన్, సునీల్, ప్రతీక్, అనౌక్, మహేష్, సుధీర్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story