- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తక్కువ బరువుతో పుట్టే పిల్లలకు ‘కంగారూ కేర్’
దిశ, ఫీచర్స్ : ఇటీవలి కాలంలో ప్రీమెచ్యూర్ బేబీస్ జననాలు పెరిగిపోయాయి. సాధారణంగా తక్కువ బరువుతో పుట్టే ఇలాంటి పిల్లలను ‘ఇంక్యుబేటర్స్’లో పెట్టి వైద్యం అందిస్తుంటారు. ఈ విధానం ద్వారా నవజాత శిశువులు ఎంతో కొంత వెయిట్ గెయిన్ చేస్తున్నా.. ఇప్పుడు ‘కంగారు కేర్’ అంతకుమించిన సత్ఫలితాలను ఇస్తుండటం విశేషం. ఆస్ట్రేలియా జాతీయ జంతువైన కంగారూకు పొట్ట భాగంలో ఓ సంచిలాంటి నిర్మాణముంటుందని తెలిసిందే. కంగారూలు అందులోనే తమ పిల్లల్ని క్యారీ చేస్తుంటాయి. ఇదే విధంగా ప్రీమెచ్యూర్, లో-వెయిట్‌తో పుట్టిన పిల్లలను.. తల్లులు హృదయానికి హత్తుకుని పెంచడమే ‘కంగారూ కేర్’. ఈ విధానం.. బిడ్డ శారీరక ఎదగుదలకు తోడ్పటమే కాకుండా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ సంజీవనిలా పనిచేస్తోంది. ఈ ప్రత్యేకతలతో అమ్మ ఒడి అద్భుతమైతే, తల్లి స్పర్శ అత్యద్భుతం అని నిరూపిస్తున్న ‘కంగారూ కేర్’ విధానంపై స్పెషల్ స్టోరీ.
నైజీరియాకు చెందిన జోమా ఎఖోమున్ గర్భవతి అయిన 31వారాలకే మగ బిడ్డకు జన్మనిచ్చింది. తక్కువ వారాలకే ప్రసవించడం వల్ల ఆ శిశువు 700 గ్రాముల బరువు మాత్రమే ఉండగా, పుట్టిన కొద్ది రోజుల్లోనే 600 గ్రాములకు తగ్గిపోయాడు. దీంతో ఆశలు వదిలేసిన వైద్యులు.. చివరి ప్రయత్నంగా లాగోస్‌లోని ‘అమువో ఓడోఫిన్’ మాతా శిశు కేంద్రానికి తరలించి ఇంక్యుబేటర్‌లో ఉంచారు. క్రమంగా కిలో బరువుకు చేరుకున్న తర్వాత ‘కంగారూ కేర్’ ప్రయత్నించండని వైద్యులు ఆ పిల్లోడి తల్లికి సజెస్ట్ చేశారు. అప్పటి నుంచి జోమా తన కుమారుడికి పాలిచ్చేటప్పుడు, నిద్రపోయే సమయాల్లో తప్ప ఎక్కడికెళ్లినా బిడ్డ తన ఛాతికి అలుముకుని ఉండేలా కట్టుకుని తిరిగింది. ఈ క్రమంలో పిల్లోడు రోజుకు 30 గ్రాములు చొప్పున పెరుగుతూ 60 రోజుల వయసొచ్చే సరికి 1.8 కిలోల బరువుకు చేరుకున్నాడు. మొదట్లో తనకు సిరంజి ద్వారా ఆహారం ఇవ్వాల్సి వచ్చేది. కానీ క్రమంగా తల్లి పాలను తాగేంత శక్తిని పొందడమే కాక మరో నెలరోజుల్లోనే బిడ్డ సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాడు. కాగా ఈ పద్ధతి ఎంత ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందో చెప్పేందుకు నైజీరియాలో జరిగిన ఈ ఒక్క ఉదంతం చాలు. ఈ నేపథ్యంలో పేద దేశాలతో పాటు, హెల్త్ ఫెసిలిటీ సరిగ్గా లేని మారుమూల ప్రాంతాల్లో కంగారూ కేర్ అవలంభిస్తే.. ఎంతోమంది ప్రీమెచ్యూర్, లో-వెయిట్ బేబీలను కాపాడుకోవచ్చనేది ఆరోగ్య నిపుణుల మాట. కానీ ఇప్పటికీ చాలా దేశాల్లో ఈ పద్ధతిపై అవగాహన లేకపోవడం గమనార్హం.
‘పుట్టిన తరువాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు లేదా అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లల సంరక్షణకు కూడా ఇది ఉత్తమ విధానం. అంతేకాదు ఇతరత్రా ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనేందుకు బిడ్డకు తగినంత ఇమ్యూనిటీని అందివ్వడంతో పాటు తల్లి పాలను మెరుగుపరుస్తుంది, శిశువు మెదడును ఉత్తేజపరుస్తుంది. తల్లీ బిడ్డల మధ్య బాండింగ్‌ను పెంచుతుంది. ముఖ్యంగా నవజాత శిశువులను తల్లి నుంచి వేరుచేయడాన్ని ఇది నివారిస్తుంది. కాగా ‘కంగారూ సంరక్షణ’ వల్ల కలిగే ప్రయోజనాలపై ‘లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్’ ప్రొఫెసర్ జాయ్ లాన్ దశాబ్ద కాలంగా పరిశోధనలు చేస్తోంది.
తక్కువ బరువు, ప్రీ మెచ్యూర్ పిల్లలు పుట్టినప్పుడు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటారు. బాడీ ఫ్యాట్ స్టోర్ కాదు, తమ శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి స్ట్రగుల్ అవుతారు, వేగంగా వేడిని కోల్పోతారు. అందుకే స్థిరమైన ఉష్ణోగ్రతను మెయింటైన్ చేయడానికి ఇంక్యుబేటర్లను ఉపయోగిస్తారు. అయితే ‘కంగారూ కేర్’ ఇంతకన్నా ప్రభావవంతమైన ఫలితాలను అందిస్తోంది. శిశువును తల్లి ఛాతికి నిటారుగా ఉంచడం ద్వారా వారి శరీరం, తల్లి శరీరంతో ప్రత్యక్ష సంబంధంలో ఉంటూ, బాడీ టెంపరేచర్‌ను స్థిరంగా ఉంచుతూనే, అల్పోష్ణస్థితిని తగ్గిస్తుంది.
కొలంబియా, బొగోటాలోని శాన్ జువాన్ డి డియోస్ హాస్పిటల్‌కు చెందిన ఇద్దరు శిశువైద్యులు 1978లో మొట్టమొదట సారిగా ‘కంగారూ కేర్’ పద్ధతిని ప్రతిపాదించారు. ఆ ఆస్పత్రిలో ప్రతి ఏటా 11వేల మంది శిశువులు జన్మించేవారు కానీ మరణాల రేటు ఎక్కువగా ఉండేది. దీంతో నవజాత శిశువుల ప్రాణాలు కాపాడటంతో పాటు ఇంక్యుబేటర్ల ఉపయోగాన్ని తగ్గించే ప్రయత్నంలో ‘కంగారూ కేర్’ పద్ధతిని అవలంభించడం మొదలుపెట్టారు. పిల్లలు శారీరకంగా ఎదగడంలో ఈ విధానం సత్ఫలితాలను ఇవ్వడంతో మరణాల రేటు తగ్గింది. ఈ మేరకు 1983లో న్యూస్ పేపర్‌లో ప్రచురితమైన ‘కంగారూ కేర్’ ఫలితాలు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాయి. ఐక్యరాజ్యసమితి చిల్డ్రన్ ఫండ్ (యునిసెఫ్) కూడా దీనిపై దృష్టిపెట్టి విస్తృత ప్రచారాన్ని మొదలుపెట్టింది. ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఈ విధానాన్ని అవలంభించి, దాని పొటెన్షియల్ బెనిఫిట్స్ గురించి మరింత తెలుసుకున్నారు. ఇది మరణాల రేటును తగ్గించడంలోనే కాకుండా, ప్రీ టెర్మ్ బేబీస్ అనారోగ్య సమస్యలను పరిష్కరించడంలో కూడా గణనీయమైన మెరుగుదలను ప్రదర్శించిందని ఆరోగ్య నిపుణులు తెలుసుకున్నారు.
ఇక ప్రపంచవ్యాప్తంగా, ప్రతి ఏట 14.8 మిలియన్ల మంది పిల్లలు ప్రీమెచ్యూర్‌గా జన్మిస్తున్నారని అంచనా. ఇందులో దాదాపు 80% కేసులు కనిష్ట, మధ్య ఆదాయ దేశాలతో పాటు ఆఫ్రికా, దక్షిణ ఆసియాలోనే వెలుగు చూస్తున్నాయి. ఇక్కడ ఇంక్యుబేటర్స్ కూడా చాలా పరిమిత సంఖ్యలో ఉన్నాయి. కాగా ఇప్పుడు బిజీగా ఉన్న నగరప్రాంత ఆస్పత్రుల్లోనూ ‘కంగారూ సంరక్షణ’ ఒక ముఖ్యమైన సాధనంగా మారుతోంది. కంగారూ సంరక్షణలో ఎక్కువ భాగం తల్లిపైనే ఉన్నప్పటికీ, తండ్రులు కూడా ఇలాంటి ఫలితాల్లో వాటా తీసుకోవచ్చని సూచించే పరిశోధనలు కూడా పెరుగుతున్నాయి. యూరప్, ఉత్తర అమెరికా అంతటా ‘కంగారూ తల్లి సంరక్షణ’ ప్రామాణిక మారుతోంది