ఆరోగ్య శ్రీ అంబులెన్స్ సేవలు.. ఎప్పటినుంచంటే?

by srinivas |
ఆరోగ్య శ్రీ అంబులెన్స్ సేవలు.. ఎప్పటినుంచంటే?
X

దిశ, అమరావతి: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్రంలో 108,104 వాహనాలు అందుబాటులోకి రానున్నాయని ఆరోగ్యశ్రీ సీఈఓ మల్లికార్జున తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చేనెల 1వ తేదీన సీఎం జగన్ వాహనాలను ప్రజలకు అందుబాటులోకి తెస్తారని తెలిపారు. నూతన అంబులెన్స్‌లో వెంటిలేటర్, ఇన్ ఫుజాన్ పుంప్స్, సిరంజి పుంప్స్ ఉంటాయని పేర్కొన్నారు. చిన్నారుల కోసం 26 నియోనేటల్ అంబులెన్సులు అందుబాటులో ఉంచుతున్నామని ప్రకటించారు.

అంబులెన్స్ వాహనాలను రూ.203.47 కోట్లతో కొనుగోలు చేశామని మల్లికార్జున తెలిపారు. మండలనికో 104 వాహనం అందుబాటులో ఉంచుతామని, 108 వాహనాలు ప్రస్తుతం 412 అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అడ్వాన్స్ లైఫ్ సపోర్టు వాహనాలు 104, లైఫ్ సపోర్టు బేసిక్ వాహనాలు 282 ఉంటాయని అన్నారు. 104 వాహనాలు 676 అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రమాదం జరిగిన 20నిమిషాల్లో, పట్టణ ప్రాంతంలో15 నిమిషాల్లో వెళుతుందని తెలిపారు. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో 25 నిమిషాల్లో వెళ్తుందని వివరించారు.

Advertisement

Next Story

Most Viewed