విమానాశ్రయాల నిర్వహణలో నిబంధనలు ఉల్లంఘించిన అదానీ గ్రూప్

by Harish |   ( Updated:2021-07-21 22:40:33.0  )
adani groups
X

దిశ, వెబ్‌డెస్క్: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ)కి చెందిన మూడు కమిటీలు అదానీ గ్రూప్ నిర్వహణలోని మంగళూరు, అగ్మదాబాద్, లక్నో విమానాశ్రయాల్లో రాయితీ ఒప్పందంలోని బ్రాండింగ్ నిబంధనలను ఉల్లంఘించినట్టు గుర్తించింది. ఈ నేపథ్యంలో ఈ మూడు విమానాశ్రయాలను నిర్వహించే అదానీ గ్రూప్ కంపెనీలు ఏఏఐ రాయితీ ఒప్పందాలకు అనుగుణంగా నిర్వహించేందుకు బ్రాండింగ్, డిస్‌ప్లేల్లో మార్పులను మొదలుపెట్టారు. గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ విమానాశ్రయాల నిర్వహణ రంగంలో కార్యకలాపాలను నిర్వహిస్తోంది.

ప్రస్తుతం ఈ గ్రూప్ ఆధ్వర్యంలో 8 అంతర్జాతీయ, దేశీయ విమానాశ్రయాలు ఉన్నాయి. వీటిలో పై మూడు ఎయిర్‌పోర్టులలో బ్రాండింగ్ నిబంధనలను అదానీ గ్రూప్ ఉల్లంఘించినట్టు తేలింది. వీటి నిర్వహణను 2019లో అదానీ గ్రూప్ బిడ్ ద్వారా సాధించగా, 2020లో ఏఏఐతో ఒప్పందం చేసుకుంది. ఏఏఐ లోగోలను డిస్‌ప్లే చేయడంలో నిబంధనల ప్రకారం జరగలేదు. దీనిపై మూడు కమిటీలు ప్రశ్నించగా, అదానీ గ్రూప్ డిస్‌ప్లే బోర్డులను మారుస్తామని ప్రకటించింది. దీనిపై స్పందించిన అదానీ గ్రూప్ ప్రతినిధి.. తాము ఏఏఐతో భాగస్వామ్యాన్ని గౌరవిస్తామని, ప్రయాణీకులకు మెరుగైన విమానాశ్రయ మౌలిక సదుపాయాలను అందించేందుకు కలిసి పనిచేయనున్నట్టు చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed