- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్రాఫిక్ చలాన్ల భయం.. బైక్‌ను దహనం చేసిన యువకుడు
దిశ, తాండూరు: ట్రాఫిక్ చలాన్ల భయంతో ఓ యువకుడు ఏకంగా బైక్‌ను తగులబెట్టాడు. ఈ సంఘటన ఆదివారం వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దేముల్ గ్రామానికి చెందిన తలారి రత్నప్ప కుమారుడు సంగప్ప.. తన బైక్ (TS 34D2183) మీద దినసరి కూలీ పనుల నిమిత్తం చుట్టుపక్కల గ్రామాలకు వెళ్తుంటాడు. ఇదే సమయంలో చాలా సార్లు హెల్మెట్ ధరించకపోవడంతో పాటు.. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడ్డాడు.
దీంతో విధుల్లో భాగంగా స్థానిక పోలీసులు చలాన్లు విధించారు. మొత్తం సదరు వాహనం మీద రూ. 4850 చలాన్లు ఉండటం గమనార్హం. కానీ, పోలీసులు చలాన్లు కట్టమన్నందుకే బైక్‌ను తగులబెట్టలేదని స్థానిక పోలీసులు క్లారిటీ ఇచ్చారు. మద్యం మత్తులోనే యువకుడు బైక్‌ను దహనం చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు.
బైక్ తగులబెట్టిన యువకుడి వివరాల ప్రకారం.. తన బైక్‌పై రూ. 5500 చలాన్లు ఉన్నాయని సంగప్ప చెప్పుకొచ్చాడు. కష్టం చేసుకొని బతికేటోన్ని వేల రూపాయల్లో చలాన్లు కట్టలేనన్నాడు. అందుకే పోలీసుల చలాన్లు భరించలేక బైక్‌ను తగులబెట్టినట్టు చెప్పుకొచ్చాడు. ఏది ఏమైనా 5 వేల చలాన్లు ఉంటే బైక్‌ను తగులబెట్టడం ఏంటని స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు.
- Tags
- bike