- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆశా వర్కర్లు చేసిన పనికి.. పెళ్లి పెటాకులకు..
దిశ, వెబ్ డెస్క్: పెళ్లి టైం కి పెళ్లి కూతురు పందిట్లో లేకపోతే.. అదెలా ఉంటుంది. అసలే అనుమానపు సమాజం పుకార్లను షికార్లు చేయిస్తారు. అయితే అంగన్వాడీలు చేసిన ధర్నా ఓ మహిళ పెళ్లిలో గందరగోలాన్ని సృష్టించింది. పెళ్లి సమయానికి వదువు ఇంటి దగ్గరి నుంచి బయలుదేరింది. అయితే ఫంక్షన్ హాలుకు పోయే మార్గంలో కలెక్టర్ ఆఫీస్ ఉంది. అక్కడ తమ డిమాండ్ల కోసం ఆశా వర్కర్లు కదం తొక్కారు. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో కారు అక్కడే ఆగిపోయింది.
ఇక పక్కనే ఉన్న వధువు సోదరుడు అక్కడే పక్కన ఉన్న ఒక వ్యక్తిని బతిమలాడి బైక్ తీసుకున్నాడు. దాంతో అక్కడ ఉన్న వారందరి అనుమానాలు తీరి సాఫీగా పెల్లి జరిగింది. నగరంలోని టీఆర్ నగర్ లో నేరెళ్ల సాహితి అనే యువతికి మధుకర్ అను వ్యక్తితో వివాహం కుదిరింది. అయితే 12.31 కి వివాహ ముహూర్తం పెద్దలు ఫిక్స్ చేశారు.
బంధువులంతా అనుకున్న సమయానికంటే ముందే ఫంక్షన్ హాలుకు చేరుకున్నారు. కానీ వధువు కారు మాత్రం ఆశా వర్కర్ల ధర్నాలో ఇరుక్కు పోయింది. జగిత్యాల రూట్ మొత్తం బంద్ కావడంతో మహూర్తానికి లేట్ అయింది. వధువు సోదరుడు స్వరాజ్ పక్కన ఉన్న షాప్ వ్యక్తికి విషయం చెప్పి అతని బైక్ పై వధువును మండపానికి చేర్చాడు. దాంతో ఎట్టకేలకు వధువు వివాహం ఆటంకం లేకుండా ముగిసింది.