మార్కెట్ చైర్మన్ కు తృటిలో తప్పిన ప్రమాదం.. ఆ వేడుకకు వెళ్లివస్తుండగా

by Shyam |
మార్కెట్ చైర్మన్ కు తృటిలో తప్పిన ప్రమాదం.. ఆ వేడుకకు వెళ్లివస్తుండగా
X

దిశ, పిట్లం:పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీ భాయ్ బాబు సింగ్ కు తృటిలో ప్రమాదం తప్పింది. శనివారం పిట్లం మండలంలోని రాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలో ఎమ్మెల్యే హనుమంత్ షిండే చేతుల మీదుగా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన తిరుగుప్రయాణంలో వెళ్తుండగా రాంపూర్ బస్టాండ్ వద్ద వారి కారును వరి కోత మిషన్ ఢీ కొట్టింది. వాహనం ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయింది. మార్కెట్ కమిటీ చైర్మన్ కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నాయకులు వరి కోత మిషన్ ను పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.

Advertisement

Next Story