- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంబర్‌పేట్‌లో ఘోర అగ్నిప్రమాదం
దిశ, అంబర్ పేట్ : దీపావళి పండుగకు అగ్నిప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే అంబర్ పేట్ నియోజకవర్గంలోని గోల్నాకలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అర్ధరాత్రి వేస్ట్ పేపర్ గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. జనావాసాల మధ్యలో ఉన్న గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది గోదాంలో భారీగా ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
గత మూడు సంవత్సరాల క్రితం కూడా ఇదే గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న గోల్నాక కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్రమంగా జనావాసాల మధ్యలో ఉన్న గోదాము పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా ఇదే గోదాంలో అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలిపారు. అక్రమంగా నెలకొల్పిన గోదాములపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు. ఇళ్ల మధ్యలో గోదాములు ఉండడం వల్ల ప్రజలకు ఇబ్బందితో పాటు భయాందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. తక్షణమే ప్రభుత్వ, అధికారుల దృష్టికి తీసుకు వెళ్లి గోదాములను సీజ్ చేస్తామని ఆయన తెలిపారు.