- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో 17 స్థానాలు గెలిస్తే రాహుల్ ప్రధాని అవుతారా?
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్ర విమర్శలు చేశారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన బీజేపీ బూత్ లేవల్ కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి అత్యధికంగా సీట్లు గెలిపించి ఇస్తామని అమిత్ షాకు సందేశం పంపాలని పార్టీ శ్రేణులను కోరారు. ఎక్కడికి వెళ్లినా.. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు మోడీకే అని చెప్తున్నారని చెప్పారు. బాధ్యతగా దీన్ని భావిస్తున్నారు.. 17 స్థానాలు గెలిపిస్తే రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
17 నియోజకవర్గాల్లో అది సాధ్యం అవుతుందా? అని ప్రశ్నించారు. 6 గ్యారంటీల పేరుతో జనాలను మోసం చేశారని అన్నారు. ఇప్పుడు 17 స్థానాల్లో గెలిపిస్తే 6 గ్యారెంటీలు అమలవుతాయని చెబుతున్నారు.. మోసం చేయడమే కాంగ్రెస్ నైజం అని విమర్శించారు. ఎన్నికలకు ముందు ఈ విషయం తెలియదా? అని మండిపడ్డారు. వంద రోజులు కాగానే హామీలు నెరవేరుస్తామని చెప్పి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపించి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రతి బూత్‌లో అందరి సమిష్టి కృషితో తెలంగాణలోని పార్లమెంట్ స్థానాలు గెలిచి మోడీకి గిఫ్ట్‌గా ఇవ్వాలని చెప్పారు.