- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇక ఒక్క నిమిషం కూడా బీఆర్ఎస్‌లో ఉండలేను.. రాజీనామాకు సిద్ధమైన కీలక నేత
దిశ, సంగారెడ్డి బ్యూరో: బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, తెలంగాణ ఉద్యమంలో తనదైన పాత్ర పోషించిన సంగారెడ్డికి చెందిన బీరయ్య యాదవ్ ఆ పార్టీకి గుడ్ చెప్పారు. ఈ మేరకు తన సన్నిహితులతో కలిసి నిర్ణయం తీసుకున్నారు. ఆ పార్టీలో ఆత్మగౌరవం లేదు. బీసీలకు న్యాయం జరగడం లేదని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండ్రోజుల్లో తనకు జరిగిన అన్యాయంపై మీడియా ముందుకు ఆయన రానున్నట్లు సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. మెదక్ ఎంపీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన ఆయన చివరకు మాజీ ఐఏఎస్ వెంకట్రామ్ రెడ్డిని ఖరారు చేయడంతో మండిపడుతున్నారు. పార్టీలోని ముఖ్యనేతలుగా చెప్పుకునే వారు మాటమీద నిలబడరని మండిపడుతున్నారు. బీఆర్ఎస్‌ను వీడనున్న ఆయన ఏ పార్టీలో చేరనున్నారో తెలియాల్సి ఉన్నది. ఆయన పార్టీని వీడడంతో ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు కొంత వరకు నష్టం తప్పదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
తెలంగాణ సాధన ఉద్యమంలో...
2001 నుంచి రాష్ట్రం వచ్చే వరకు తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి జిల్లాలో చురుకైన పాత్ర పోషించారు. తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం కృషి చేశారు. ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయినట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. ఉద్యమంలో భాగంగా పోలీస్ కేసులు అయ్యాయి, లాఠీ దెబ్బలు తిని జైలు కూడా వెళ్లారు. అప్పటి నుంచి ఆయన పార్టీ నుంచి పదవులు గాని ఆర్థికంగా ఎలాంటి ప్రయోజనాలు పొందలేదని బాధపడుతుంటారు. కాగా మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జిల్లా మాజీ మంత్రి హరీష్ రావులకు పలు సందర్భాల్లో స్వయంగా కలిసి అభ్యర్థించారు. తెలంగాణ రాష్ట్రంలో గొల్ల కురుమల జనాభా ఎక్కువగా ఉన్నదని, ఆ వర్గాల ప్రతినిధిగా మెదక్ నుంచి అవకాశం కల్పించాలని కోరాడు. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా సమర్థవంతంగా పనిచేసినా, పార్టీ కోసమే పనిచేసినా. అయినా తమ లాంటి వారిని బీఆర్ఎస్ పార్టీ పక్కన పెట్టిందని బీరయ్య సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వెంకట్రామ్ రెడ్డికి ఇవ్వడంతో...
తమ లాంటి ఉద్యమకారులు, నికార్సయిన బీఆర్ఎస్ పార్టీ నాయకులను కాదని మాజీ ఐఏఎస్ వెంకట్రామ్ రెడ్డిని మెదక్ అభ్యర్థిగా ఖరారు చేయడాన్ని బీరయ్య యాదవ్ తప్పబడుతున్నారు. ఈ పార్టీలో ఆత్మగౌరవం ఎక్కడుంది..? బీసీలకు న్యాయం ఎక్కడుంది..? సీఎం కేసీఆర్, హరీష్ రావుల ఇంటి చుట్టూ తిరిగినా కనీసం పట్టించుకోలేదని సన్నిహితుల వద్ద ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బులున్న వారికి పార్టీలో పట్టం కట్టి పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కన పెట్టడంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ దారుణ ఓటమి చవిచూసిందని పార్టీ నాయకులు, కార్యకర్తల వద్ద మండిపడుతున్నట్లు చెబుతున్నారు. ఉద్యమ పరంగా, ఆర్థికంగా ఆగమయ్యాయి. అయినా పార్టీని పట్టుకుని ఉన్నాం. అలాంటి మాకు పార్టీలో ఏం న్యాయం జరిగిందని ఆయన ప్రశ్నిస్తున్నారు.
రెండు రోజుల్లో మీడియా ముందుకు...
రెండు రోజుల్లో బీరయ్య యాదవ్ మీడియా ముందుకు రానున్నారు. అక్కడ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. పార్టీలో తనకు జరిగిన అన్యాయంపై ఆయన గళమెత్తనున్నారు. అయితే బీఆర్ఎస్ ను వీడనున్న ఆయన ఏ పార్టీలో చేరనున్నారో తెలియడం లేదు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన తరువాత ఎందులో చేరాలో నిర్ణయం తీసుకుంటానని చెబుతున్నారు. అంత్యంత సన్నిహితుల ద్వారా తెలుస్తున్న సమాచారం మేరకు కొద్ది రోజుల్లో బీఆర్ఎస్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. చేరిక విషయంలో ఆయన ఏ నిర్ణయం తీసుకోనున్నారోననే అంశం రాజకీయంగా ఆసక్తి నెలకొన్నది.