- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
KKR Vs MI మ్యాచ్‌కు వర్ష గండం.. నిర్వాహణ సాద్యమేనా..?
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2024 లో భాగంగా ఈ రోజు 60 మ్యాచ్ జరగనుంది. కాగా కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరగనున్న ఈ మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారింది. ఆ రాష్ట్ర వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. వర్షం పడే అవకాశం 60 శాతం నుంచి 70 శాతం ఉందని అంచనా వేసింది. అలాగే మ్యాచ్ ప్రారంభం అయ్యే సమయానికి 82 శాతం వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. స్థానిక వార్తల కథనం ప్రకారం.. ఉదయం కాస్త మెరుగ్గా వాతావరణం ఉన్నప్పటికీ మధ్యాహ్న సమయానికి.. నల్లటి మేఘాలతో భారీ వర్షాలు ప్రారంభం అయ్యాయి. దీంతో గ్రౌండ్ మొత్తం పట్టాలతో కప్పి వేశారు. దీంతో సాయంత్రం వరకు వర్షం తగ్గితే పూర్తిస్థాయి మ్యాచ్ సాధ్యం కాకుంటే.. కనీసం 10 ఓవర్ల మ్యాచ్ అయిన నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధం అయ్యారు. కానీ సాయంత్రం లోపు వాతావరణం మారకపోతే మాత్రం మ్యాచ్ రద్దవుతుంది. దీంతో ఇరుజట్లుకు చెరో పాయింట్ వస్తుంది. దీంతో కలకత్తా జట్టు ప్లే ఆఫ్స్‌కు క్వాలీపై అవుతుంది.
KKR అంచనా జట్టు XI: ఫిల్ సాల్ట్ (Wk), సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీ, శ్రేయాస్ అయ్యర్ (c), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా
MI అంచనా జట్టు: ఇషాన్ కిషన్ (WK), రోహిత్ శర్మ, నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (c), టీమ్ డేవిడ్, అన్షుల్ కాంబోజ్/లూక్ వుడ్, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, నువాన్ తుషార.