- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ముంబై చిత్తు.. ప్లే ఆఫ్ చేరిన కలకత్తా
దిశ, వెబ్ డెస్క్: వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన ముంబై, కేకేఆర్ మ్యాచ్ అర్ధరాత్రి వరకు కొనసాగింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై జట్టు బౌలింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా 16 ఓవర్లకు మ్యాచును కుదించడంతో కలకత్తా జట్టు మొదటి నుంచే దీటుగా ఆడింది. దీంతో నిర్ణీత 16 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి.. 157 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో తుషారా, అన్షుల్ కంబోజ్, ఒక్కో వికెట్ తీసుకోగా.. బూమ్ర, పీయూష్ చావ్లా 2 వికెట్లు తీసుకున్నారు. కాగా 158 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన ముంబై జట్టు నిర్ణీత 16 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి కేవలం 139 పరుగులు మాత్రమే చేసింది. దీంతో కలకత్తా జట్టు 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో కేకేఆర్ బౌలర్లు హర్షిత్ రాణా 2, వరుణ్ చక్రవర్తి 2, రస్సేల్ 2, సునీల్ నరైన్ 1 వికెట్లు తీసుకున్నారు. అలాగే 2024 ఐపీఎల్ సీజన్ లో ప్లే ఆఫ్ కు అర్హత సాధించిన తొలి జట్టుగా కేకేఆర్ నిలిచింది. ఈ సీజన్ లో మొత్తం 12 మ్యాచులు ఆడిన కేకేఆర్ జట్టు 9 విజయాలతో 18 పాయింట్లు సాధించింది. కాగా మరో రెండు మ్యాచులు మిగిలి ఉండగా టాప్‌పొజిషన్ లో కనసాగేందుకు ఆ మ్యాచులు కేకేఆర్ కు ఉపయోగపనున్నాయి.