- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేడు సన్ రైజర్స్ జట్టులోకి కీలక ప్లేయర్లు!
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2024 సంచలన రికార్డులకు నిలయంగా మారింది. ఇందులో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ సీజన్ లో ఎవరూ ఊహించని రీతిలో ఐపీఎల్ చరిత్రలను తిరగరాస్తూ.. కొత్త రికార్డులను సృష్టిస్తుంది. కాగా ఈ సీజన్ లో ఇప్పటి వరకు 8 మ్యాచులు ఆడిన ఆరెంజ్ ఆర్మీ జట్టు ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ సీజన్ లో మరో 6 మ్యాచులు మిగిలి ఉండగా ఇందులో కచ్చితంగా 3 విజయాలు అవరసం ఉంది. ఈ క్రమంలో నేడు ఎస్ ఆర్ హెచ్ జట్టు చెన్నై జట్టుతో చెపాక్ స్డేడియంలో తలపడనుంది. ఈ క్రమంలో మొదటి రెండు జట్ల మధ్య ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచులో సన్ రైజర్స్ అలవోకగా మ్యాచ్ గెలిచింది. దీంతో ఈ రోజు సాయంత్రం జరగబోయే మ్యాచ్‌లో చెన్నై పగా తీర్చుకునేందుకు పటిష్టంగా తిరిగి వస్తుంది.
ఈ మ్యాచులో చెన్నై జట్టును దీటుగా ఎదుర్కొనేందుకు ఆరెంజ్ ఆర్మీ సిద్ధమైంది. దీనికి ముందు మ్యాచులో ఆర్సీబీ తో ఓడిపోవడంతో మరోసారి అలా జరగకూడదని జట్టు భావిస్తుంది. ఇందులో భాగంగా వరుసగా విఫలమవుతున్న మార్క్రమ్ స్థానంలో ఆల్ రౌండర్ జన్ సన్, గ్లేన్ ఫిలిప్స్ ను జట్టులోకి తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. జన్‌సన్ మంచి బౌలర్‌గా పేరుగాంచిన హిట్టింగ్ కూడా చేయగలడు. అలాగే ఫిలిప్స్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ తో కీలక సమయాల్లో వికెట్లు కూడా తీయగలడు. అలాగే మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్‌లో విద్యంసకర షాట్లు కొట్టగలడు దీంతో.. ఇంపాక్ట్ ప్లేయర్ గా హెడ్ స్థానంలో జన్ సన్ లేదా, ఫిలిప్స్‌లను తీసుకునే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు ఇదే నిజమైతే మిడిల్ ఆర్డర్ లో క్లాసిన్, సమద్, షాబాజ్, లకు తోడు ఫిలిప్స్ తోడవ్యనున్నాడు.