- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పండగ వేళ విషాదం..తిరుమల క్యూ కాంప్లెక్స్‌లో మహిళ మృతి
దిశ,వెబ్‌డెస్క్: వినాయక చవితి పండుగ వేళ తిరుమలలో విషాదం నెలకొంది. శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఉన్న భక్తురాలు ఝాన్సీ(32) గుండెపోటుతో కుప్పకూలింది. అక్కడే ఉన్న తోటి భక్తులు, ఆమె తండ్రి అయోమయానికి గురయ్యారు. ఇంతలో వైద్య సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న నర్సులు ఆమెకు గుండెపోటు వచ్చినట్లు గుర్తించారు. వెంటనే ఝాన్సీకి సీపీఆర్ మొదలుపెట్టారు. ఈక్రమంలో తోటి భక్తులు, నర్సులు సీపీఆర్ చేసి అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించేలోపు ఆమె ప్రాణాలు కోల్పోయింది. దీంతో తన తండ్రి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తన కూతురికి ఇద్దరు కవల పిల్లలున్నారని చెప్పారు. వారి పరిస్థితి ఏంటని ఆయన తీవ్ర మనోవేదనకు గురయ్యారు. అంబులెన్స్ గంట ఆలస్యంగా రావడంతోనే తమ కూతురు చనిపోయిందని తండ్రి బోరున విలపించాడు. అంబులెన్స్ వెంట వెళ్లిన తోటి భక్తులు సైతం కన్నీటి పర్యంతమయ్యారు. అయితే అంబులెన్స్ గంట లేటుగా రావడం పై మహిళ తండ్రి, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.