వీడేమి పోలీసురా బాబు.. ప్రియుడిని తరిమేసి యువతిపై అత్యాచారం

by Aamani |
వీడేమి పోలీసురా బాబు.. ప్రియుడిని తరిమేసి యువతిపై అత్యాచారం
X

దిశ,వెబ్‌డెస్క్ : ఈ మధ్య కాలంలో అత్యాచారాలు గంట గంటకు పెరిగిపోతున్నాయి.వాయివరసలు లేకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.రక్షణగా ఉండవలసిన రక్షక భటులు కూడా అఘాయిత్యాలకు పనులకు పాల్పడుతున్నారు. అలాంటి ఓ సంఘటన విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలో చోటుచేసుకుంది.బొండపల్లి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించే హోంగార్డు మొయిద సురేష్ మంగళవారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరాడు. దారిలో కొండకరకం సమీపంలో ఓ ప్రేమజంట కనిపించారు. వారి వద్దకు వెళ్లి తాను ఎస్సైని అని, ఇక్కడ ఏం చేస్తున్నారంటూ బెదిరించాడు. దీంతో ప్రియుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ హోంగార్డు యువతిని బస్సెక్కిస్తానని నమ్మించి తన బైకుపై రామతీర్థం సమీపంలోని చంపావతి నది ఒడ్డున ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు.బాధితురాలి ఫిర్యాదు మేరకు బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Next Story

Most Viewed