- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హోటల్ గదిలో మూడు శవాలు.. అసలు ఏం జరిగిందంటే?
దిశ, వెబ్‌డెస్క్: ఒకే హోటల్ రూంలో భార్యాభర్తలతో పాటు మరో మహిళ చనిపోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కేరళలోని కొట్టాయం ప్రాంతానికి చెందిన నవీన్-దేవి అనే భార్యభర్తలు ఆయుర్వేద వైద్యులు. రీసెంట్ గా దేవి తన స్నేహితురాలు ఆర్య.. భర్త నవీన్ తో కలిసి అరుణాచల్ ప్రదేశ్ కు వెళ్లారు. అక్కడ లోయర్ సుబన్‌సిరి జిల్లాలోని హపోలీలో ఉన్న బ్లూఫైన్ హోటల్ ఒక రాత్రి బస చేశారు. తెల్లారేసరికి విగతజీవులుగా కనిపించారు. అరుణాచల్ పోలీసుల కథనం ప్రకారం.. నవీన్ తండ్రి చేతబడి జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీరి మరణానికి అసలు కారణమేంటో ఆధారాలను సేకరించేందుకు మా టీమ్ అరుణాచల్ ప్రదేశ్ కు వెళ్లింది. ప్రొసీజర్స్ అన్ని కంప్లీట్ అయ్యాక ఆధారాలను తీసుకొస్తాం. ఈ ముగ్గురు అక్కడికి ఎందుకు వెళ్లారు. దేవి ఫ్రెండ్ తమతో ఎందుకు వెళ్లింది? వారి మరణాలు ఎలా సంభవించాయి. కావాలనే ఆత్మహత్య చేసుకున్నారా? మరేదైనా కారణముందా? అనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నాం. త్వరలో వీరి మరణానికి గల కారణమేంటో తెలియజేస్తామని పోలీసులు వెల్లడించారు.