- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అనుమానస్పదంగా వృద్దురాలి మృతి
దిశ,కారేపల్లి : కారేపల్లి మండలం సామ్యా తండాలో వృద్ధురాలి శరీర గాయాలతో అనుమానస్పదంగా మృతి చెందిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సామ్యాతండాకు చెందిన గుగులోత్ సక్రి(65) కూలీ పనులకు వెళ్తుంది. భర్త గుగులోత్ సామ్యా విశ్రాంత సింగరేణి కార్మికుడు కొంత కాలం క్రితం మృతి చెందాడు. వీరికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలున్నారు. వీరికి వివాహాలు కావటంతో వారు వేరుగా ఉంటుండగా వృద్దురాలు సక్రి ఒంటరిగా ఫించన్ పైకం, కూలీ పైకంతో జీవిస్తుంది.
ఈ క్రమంలో మొహరం పండగకు సంబంధించి మొక్కులు తీర్చుకోవాలని తల్లి సక్రి కి బిడ్డలు ఫోన్ చేస్తున్నారు. ఫోన్ రింగ్ అవుతున్నా ఎంతకి ఎత్తక పోవటంతో కుమార్తెలు పక్కనే ఉంటున్న వారికి ఫోన్ చేసి సక్రి గురించి వాకబు చేశారు. దీంతో చుట్టు పక్కల వారు సక్రి ఇంటికి వచ్చి చూడగా వృద్దురాలు ముఖంపై తీవ్రగాయాలతో రక్తపు మడుగులో మంచం పై పడి ఉంది. ఈ విషయాన్ని వృద్దురాలి కుటుంబ సభ్యులకు తెలుపడంతో వారు పోలీసులకు కబురు చేశారు. సింగరేణి సీఐ తిరుపతి రెడ్డి సంఘటన స్ధలాన్ని చేరుకోని విచారిస్తున్నారు. వృద్ధురాలిని హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు.