బాలాపూర్​లో వింత దొంగలు..బిర్యానీ వేడి చేసుకుని తిన్న దుండగులు

by Aamani |
బాలాపూర్​లో వింత దొంగలు..బిర్యానీ వేడి చేసుకుని తిన్న దుండగులు
X

దిశ, బడంగ్ పేట్​ : ఇంటి తాళాలు పగల కొట్టి గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి నగదు, బంగారం, వెండి నగలతో ఉడాయించిన సంఘటన బాలాపూర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో తీవ్ర కలకలం రేపుతోంది. అంతేగాకుండా దొంగిలించిన సొత్తు మూటకట్టుకున్న గుర్తు తెలియని వ్యక్తులు ఫ్రిజ్​ లో ఉన్న భిర్యానిని సైతం వేడి చేసుకుని తిని కూల్​డ్రింక్స్​ను కూడా తాగిన తీరు చూస్తుంటే దాదాపు దొంగతనం చేసిన ఇంట్లోనే 2 నుంచి 3గంటల వరకు దర్జాగా గడిపినా ఎవరూ పట్టించుకోక పోవడం విశేషం.

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..

నబీల్​ కాలనీలో ఓ నర్సు కుటుంబం నివసిస్తుంది. ఈ నెల 26వ తేదీన మహిళ కుటుంబం బంధువుల ఇంటికి వెళ్లింది. మరునాడు మధ్యాహ్నం వచ్చి చూసే సరికి ఇంటి తాళాలు, బెడ్​ రూమ్​ గదితో పాటు ఇతర గదుల తలుపులు ధ్వంసమై ఉన్నాయి. ఇంట్లోని గృహోపకరణ వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువా తాళాలు పగులగొట్టి ఉండడంతో పాటు బీరువాలోని బంగారు ఆభరణాలతో పాటు వెండి, నగదు చోరీకి గురయ్యింది. అంతేగాకుండా ఫ్రిజ్​లో పెట్టిన బిర్యాని గిన్నె మరో గదిలో కనిపించింది. విచిత్రమేంటంటే అందులో బిర్యాని కూడా మాయమయ్యింది. ఆందోళనకు గురైన ఇంటి యజమానురాలు బాలాపూర్​ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వీడియోలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి.

సదరు మహిళ ఇంట్లోకి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడిన అనంతరం ఫ్రిజ్​లో ఉన్న భిర్యానిని స్టౌవ్​ మీద వేడి చేసుకుని దర్జాగా తిని ... కూల్​ డ్రింక్​లు సైతం తాగడాన్ని చూస్తుంటే దొంగతనం జరిగిన ఇంట్లోనే దాదాపు 2 నుంచి మూడు గంటల పాటు గడిపిన ఎవరూ పట్టించుకోక పోవడం గమనార్హం. అంతేగాకుండా ఈ విషయమై బాలాపూర్​ పోలీసులకు ఫిర్యాదు చేస్తే మీ ఇంటి వైపు రోడ్డు సరిగ్గా లేని కారణంగా నైట్​ పెట్రోలింగ్​ చేయలేకపోయామని బాలాపూర్​ పోలీసులు తెలిపినట్లుగా సదరు మహిళ పేర్కొనడం గమనార్హం. బాలాపూర్​ పోలీసులు మాత్రం ఈ చోరీ విషయం తమకు తెలియదంటే తమకు తెలియదని మీడియాకు చెప్పారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed