ఖరీదు వ్యాపారి మధుకర్ అరెస్ట్.. రూ.3 కోట్లతో పారిపోయిన శ్రీ కనక మహాలక్ష్మి ట్రేడర్

by Aamani |
ఖరీదు వ్యాపారి మధుకర్ అరెస్ట్.. రూ.3 కోట్లతో పారిపోయిన శ్రీ కనక మహాలక్ష్మి ట్రేడర్
X

దిశ,వరంగల్ టౌన్ :శ్రీ కనక మహాలక్ష్మి ట్రేడర్స్ పేరుతో సరుకులు ఖరీదు చేస్తూ 60 మంది అడ్తి వ్యాపారులకు సుమారు రూ. 3 కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి పారిపోయిన ఓ ఖరీదు వ్యాపారిని శుక్రవారం ఏనుమముల పోలీసులు అరెస్టు చేశారు. ఎనుమాముల సిఐ పులి రమేష్ కథనం మేరకు వివరాలు.. వరంగల్ బాలాజీ నగర్ కు చెందిన ఇమ్మడి మధుకర్ శ్రీ కనకమహాలక్ష్మీ ట్రేడర్ పేరుతో గత 12 ఏండ్లుగా ఖరీదు వ్యాపారం చేస్తున్నాడు.ఎనుమాముల మార్కెట్ పరిధిలోని అడ్తి వ్యాపారుల నుంచి మొక్కజొన్నలు, నూకలు ఇతర సరుకులు కొనుగోలు చేస్తూ వ్యాపారం కొనసాగిస్తున్నాడు.ఇంతవరకు బాగానే ఉంది.

కానీ గత 6 నెలలుగా అడ్తి దారుల వద్ద కొనుగోలు చేసిన సరుకులకు రేపు,మాపు అంటూ మాయమాటలు చెబుతూ నమ్మిస్తూ వచ్చారు. ఇటీవల ఆ వ్యాపారి ఒక్కసారిగా కనిపించకుండా పోయారు.దీంతో అడ్తి వ్యాపారులు కంగుతిన్నారు.ఏమిచేయాలో అర్థం కాక 60 మంది అడ్తి దారులు స్థానిక ఏనుమముల పోలీసులను ఆశ్రయించారు. ఖరీదు వ్యాపారి ఇమ్మడి మదుకర్ పై ఇటీవల అడ్తి దారులు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.శుక్రవారం ఇమ్మడి మధుకర్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు సీఐ పులి రమేష్ తెలిపారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన ఎస్సై లు శ్రీకాంత్, నరసింహారావు, సిబ్బందిని సీఐ అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed