లాడ్జిలో ఏకాంతంగా జంట.. లవర్‌ని పక్కకు తోసేసి మహిళపై ఆరుగురు అత్యాచారం.. సీసీ కెమెరాలో రికార్డ్

by Nagaya |
లాడ్జిలో ఏకాంతంగా జంట..  లవర్‌ని పక్కకు తోసేసి మహిళపై ఆరుగురు అత్యాచారం.. సీసీ కెమెరాలో రికార్డ్
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రియుడితో హోటల్ గదిలో ఉన్న మహిళపై ఆరుగురు యువకులు దాడి చేసిన కేసు కీలక మలుపు తిరిగింది. మహిళను బలవంతంగా అడవిలోకి లాక్కెళ్లిన యువకులు ఆమెపై ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేసినట్లు తేలింది. కారు డ్రైవర్ సైతం అఘాయిత్యానికి పాల్పడట్లు ఆ మహిళ విడుదల చేసిన వీడియోలో తెలిపింది. కర్ణాటకలో కలకలం రేపుతోన్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. వారి కథనం ప్రకారం..

హవేరి జిల్లా, హనగల్ తాలూకాలోని ఓ లాడ్జి గదిలో 26 ఏళ్ల ముస్లిం మహిళ 40 ఏళ్ల బస్ డ్రైవర్‌తో ఏకాంతంగా గడుపుతోంది. ఆ మహిళకు పెళ్లై భర్త కూడా ఉన్నాడు. అయినా ఆమె మూడేళ్లుగా బస్ డ్రైవర్‌లో ఎఫైర్ నడుపుతుంది. అయితే వివాహిత మహిళ తన ప్రియుడితో ఏకాంతంగా గడుపుతున్న విషయాన్ని గమనించిన ఆరుగురు యువకులు లాడ్జికి వెళ్లి తలుపు తట్టారు. ఆమె ప్రియుడు వచ్చి తలుపులు తీయగా.. ఆయన్ను పక్కకు నెట్టేసి లోపలికి వెళ్లారు. వాళ్లను చూసిన వివాహిత ముఖంపై బురఖాను కప్పేసుకుంది. లాడ్జిలో మీరిద్దరు ఏం చేస్తున్నారు..? ఎందుకు వచ్చారు..? అని ఆమెను ప్రశ్నించారు. అనంతరం వారిద్దరిపై దాడి చేసి గది నుంచి లాక్కెళ్లారు. ఈ దృశ్యాలను మొత్తం యువకులు వీడియో రికార్డ్ చేశారు.

వివాహిత మహిళను సమీపంలోకి అడవి ప్రాంతానికి లాక్కెళ్లి ఒకరి తర్వాత మరొకరు కలిసి అత్యాచారం చేశారు. ఆ తర్వాత కారులో ఎక్కించుకోని హవేరి నగరం చుట్టూ తిప్పారు. ఆ సమయంలో కారు డ్రైవర్ సైతం ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ ఘటన జనవరి 8వ తేదీన జరిగింది. అయితే ఆ రోజు కేవలం తనపై, తన ప్రియుడిపై దాడి మాత్రమే చేశారని ఫిర్యాదు చేసిన వివాహిత గురువారం విడుదల చేసిన వీడియోలో సంచలనాలను బయటపెట్టింది. ఆ రోజు తనపై దాడి చేయడంతోపాటు ఆరుగురు యువకులు అత్యాచారం చేశారని, వీడియోలు తీశారని తను విడుదల చేసిన వీడియోలో తెలిపింది. ఆ తర్వాత నన్ను బస్టాప్‌లో వదిలేశారు.. వారిని శిక్షించాలని కోరుతున్నాను అని బాధితురాలు చెప్పింది.

అయితే ఈ ఘటనపై హవేరి పోలీస్ సూపరింటెండెంట్ అన్షు కుమార్ స్పందించారు. ఘటన జరిగిన రోజే కేసు నమోదు చేశామని తెలిపారు. ఆ రోజు కేవలం తమ జంటపై దాడి మాత్రమే జరిగినట్లు బాధితురాలు తెలిపిందని వెల్లడించారు. తాజాగా ఆమె విడుదల చేసిన వీడియోలో గ్యాంగ్ రేప్ జరిగినట్లు తాము టీవీ న్యూస్‌లో చూశామని చెప్పారు. వివాహిత అయిన ముస్లిం మహిళ, తాను హోటల్‌లోకి ప్రవేశించిన వ్యక్తితో సంబంధం కలిగి ఉందని పోలీసులు తెలిపారు. లవర్స్ జంటను బ్లాక్ మెయిల్ చేయడానికి నిందితులు వీడియో తీశారని, ఈ దృశ్యాలు లాడ్జిలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయని వెల్లడించారు. అత్యాచారం జరిగినట్లు తమన దృష్టికి వచ్చిందని ఈమేరకు హత్యాయత్నం, అత్యాచారం, కిడ్నాప్ తదితర కేసులు నమోదు చేశామన్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీస్ సూపరింటెండెంట్ అన్షు కుమార్ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed