- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గంజాయి స్మగ్లర్‌పై పీడీ యాక్ట్..
దిశ,హనుమకొండ : గంజాయి స్మగ్లర్ పై వరంగల్ పోలీస్ కమిషనర్ సోమవారం పీడీ యాక్ట్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ నుంచి వరంగల్ మీదుగా మహారాష్ట్రకు గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న భూపాలపల్లి జిల్లా గోరు కొత్తపల్లి ప్రాంతానికి చెందిన గజ్జి సహా దేవ్ రాజ్ పై వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా జారీచేసిన పీడీ యాక్ట్ ఉత్తర్వులను శాయంపేట సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ రంజిత్ రావు, దామెర ఎస్సై అశోక్ నిందితుడికి పరకాల సబ్ జైల్లో అందజేసి చర్లపల్లి జైలుకు తరలించారు. పీడీ యాక్ట్ ఉత్తర్వులను అందుకున్న నిందితుడు గత జూన్ నెల 8వ తేదీన మరో ఇద్దరు నిందితులతో కలిసి ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్రకు గంజాయి అక్రమ రవాణాకు చేస్తుండగా టాస్క్ ఫోర్స్, దామెర పోలీసులు సంయుక్తంగా కలిసి ఈ ముఠాను అరెస్ట్ చేశారు.
ఈ ముఠా నుంచి పోలీసులు రూ.యాభై లక్షల విలువగల 192 కిలోల గంజాయితో పాటు ఒక కారు , మూడు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకుని జైలుకు తరలించారు. సులభంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో దేశ అభివృద్ధి కీలకమైన యువతను మత్తు పదార్థాలకు బానిస గా మార్చేందుకు గాను మత్తుపదార్థాల అక్రమ రవాణాకు పాల్పడితే సహించేది లేదని అలాగే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే పీడీ యాక్ట్ క్రింద కేసులు నమోదు చేయ బడుతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.