వరకట్నం వేధింపులకు వివాహిత ఆత్మహత్య

by Kalyani |
వరకట్నం వేధింపులకు వివాహిత ఆత్మహత్య
X

దిశ, కుత్బుల్లాపూర్ : బాచుపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో వరకట్నం వేధింపులకు ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాచుపల్లి సాయి నగర్ లో నివసిస్తున్న సుంకరి అరుణకు ఎర్రగండ్ల గోపితో 2017 లో వివాహం జరిపించారు.పెళ్లి లో నగలు, నగదు, ఇంటి సామాగ్రి భారీగా ముట్టజెప్పి బంధువులు, శ్రేయోభిలాషుల సమక్షంలో గోపితో సుంకరి అరుణకు తల్లిదండ్రులు ఘనంగా వివాహం జరిపించారు.

అయితే కొన్నాళ్ళు బాగానే సాగిన అరుణ వైవాహిక బంధం తనకు ఇద్దరు ఆడ పిల్లలు పుట్టిన తర్వాత గత కొన్ని సంవత్సరాల నుండి అదనపు కట్నం కోసం వేధింపులు ఎక్కువైనట్లు తన తల్లితో చెప్పుకుని అరుణ బాధ పడేది. వరకట్నం వేధింపులతో పాటు భర్త గోపి నుంచి అనుమానం,మానసిక, శారీరక హింస పెరిగి పోవడంతో సువర్ణ ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో సోమవారం తెల్లవారుజామున ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అరుణ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed