- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి.. రెండు రోజుల తర్వాత మృతదేహం లభ్యం
దిశ,తొర్రూరు: చేపల వేటకు వెళ్లిన వ్యక్తి మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం...తొర్రూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన గుండాల నరసయ్య అన్న వెంకన్న ఇద్దరు కలిసి శనివారం రాత్రి 7 గంటలకు బర్ల చెరువులో చేపల వేటకు వెళ్లారు.అన్న వెంకన్న గట్టు పైన ఉన్నాడు.తమ్ముడు నర్సయ్య చెరువులోకి వెళ్లి కచ్చువల చూసి వస్తానని చెప్పి చెరువులో దిగడని తెలిపారు.దిగిన అర్ధగంట అయిన రాకపోవడంతో గట్టు పైన ఉన్న వెంకన్న, తమ్ముడు నర్సయ్యను పిలవడం మొదలుపెట్టారు.ఎంత పిలిచినా, రాకపోవడంతో,హుటాహుటిన ఇంటికి తిరిగి వచ్చి కుటుంబ సభ్యులకు తెలిపారు.
విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి వెళ్లి వెతికారు.అయిన కూడా నరసయ్య మృతదేహం దొరకకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రెండు రోజులు గాలింపు చేసిన నరసయ్య మృతదేహం దొరకడం లేదని పోలీసులు తెలిపారు.శనివారం రాత్రి ఉరుములు మెరుపులు అధికంగా రావడం తో నర్సయ్య భయపడి చెరువులో ఉన్న వలకు చుక్కుకున్నడని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే రెండు రోజుల తర్వాత సోమవారం ఉదయం నర్సయ్య మృతదేహం చెరువులో పైకి తేలడంతో నర్సయ్య మృతదేహాన్ని బయటకు తీయడంతో కుటుంబసభ్యులు బోరున విలపించారు.