- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పాత కక్షలతో యువకుడిపై కత్తితో దాడి
దిశ,సత్తుపల్లి: వేంసూరు మండలం భీమవరం గ్రామానికి చెందిన విస్సంపల్లి సురేష్, పల్లె పోగు సురేష్, బావ బామ్మర్దులు. ఇద్దరు సత్తుపల్లి నుంచి వేంసూరు మండలం మర్లపాడు సెంటర్ కు చేరుకోగా ముందస్తు ప్రణాళిక లో భాగంగా అక్కడే మాటు వేసి ఉన్న అదే గ్రామానికి చెందిన నడ్డి రవి, తన వెంట తెచ్చుకున్న కత్తితో విస్సంపల్లి సురేష్ పై దాడి చేయగా సురేష్ చేయి పై తీవ్ర గాయమైంది. పక్కనే ఉన్న సురేష్ బావ పల్లె పోగు సురేష్ నడ్డి రవి పై బండ రాయితో దాడి చేయగా రవి తలకు బలమైన గాయమైంది.
స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కడకు చేరుకున్న పోలీసులు ముగ్గురిని సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించగా, విస్సంపల్లి సురేష్ పరిస్థితి విషయంగా ఉండటంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన నడ్డి రవి, పల్లె పోగు సురేష్ సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి ముగ్గురిపై గతంలో వేంసూరు మండల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అవ్వగా ముగ్గురు పాత కక్షలతో దాడి చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ సంఘటనపై వేంసూరు మండల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.