Raj Tarun's parents : మాదాపూర్ పీఎస్ లో లావణ్య పై హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రుల ఫిర్యాదు

by Sridhar Babu |
Raj Taruns parents : మాదాపూర్ పీఎస్ లో లావణ్య పై హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రుల ఫిర్యాదు
X

దిశ, శేరిలింగంపల్లి : టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్, లావణ్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. తరచూ వార్తల్లోకి ఎక్కుతున్నారు వీరిద్దరూ. తాజాగా రాజ్ తరుణ్ తల్లిదండ్రులు బసవరాజు, రాజ్యలక్ష్మీ గురువారం రాత్రి రాజ్ తరుణ్ మాజీ లవర్ లావణ్య పై మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బుధవారం రాత్రి మాదాపూర్ కాకతీయ హిల్స్ లో నివాసం ఉంటున్న హీరో రాజ్ తరుణ్ ఇంటికి వెళ్లి లావణ్య గొడవ చేసిందని, తలుపులను గట్టిగా బాదుతూ డోర్లు తెరవాలంటూ నానా హంగామా సృష్టించిందని, న్యూసెన్స్ చేసిందని, తమపై దాడికి ప్రయత్నించిందని రాజ్ తరుణ్ తల్లిదండ్రులు లావణ్య పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తమకు ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయని, లావణ్య వల్ల తమకు ప్రాణహాని ఉందని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాజ్ తరుణ్ లాయర్ ఇంద్రగంటి మధు శర్మ మాట్లాడుతూ.. లావణ్య వల్ల రాజ్ తరుణ్ తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని, గతంలో ఆమెకు నేరచరిత్ర ఉందని, వారిని ఏమైనా చేసే అవకాశం ఉందన్నారు. రాజ్ తరుణ్ తల్లిదండ్రులకు హై బీపీతో కూడిన ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయని ఆయన తెలిపారు. లావణ్య కావాలనే రాజ్ తరుణ్ ఇంటి వద్దకు వెళ్లి పేరెంట్స్ ని బెదిరించిందని, వారికి పోలీసు ప్రొటెక్షన్ కావాలన్నారు. లావణ్యకు సంబంధించిన అన్ని ఆధారాలు రాజ్ తరుణ్ వద్ద ఉన్నాయని, తాము న్యాయపరంగా కోర్ట్ లో చూసుకుంటామన్నారు. ప్రతి చోటా విమెన్ విక్టిమ్ కార్డ్ పని చేయదన్నారు.

Advertisement

Next Story

Most Viewed