ఫ్లై ఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. యువతి దుర్మరణం

by Shiva |
ఫ్లై ఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. యువతి దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్ : రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం పాలైన ఘటన సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భరత్ నగర్ ఫ్లైఓవర్‌పై ఇవాళ చోటుచేసుకుంది. కర్నూలు పట్టణానికి చెందిన పిట్టల సునీత (25) అనే యువతి స్కూటీపై కూకట్‌పల్లి నుంచి శ్రీనగర్ కాలనీకి వెళ్తోంది. ఈ క్రమంలో స్కూటీ భరత్‌ నగర్ ఫ్లైఓవర్ మీదకు రాగానే.. వెనుక నుంచి ట్యాంకర్ వేగంగా ఢీకొట్టింది. దీంతో స్కూటీ అదుపు తప్పి సునీత పక్కనే వెళ్తున్న బస్సు కింద పడి మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. అనంతరం ట్యాంకర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story