అదుపుతప్పి ఆటో బోల్తా.. ఒకరు మృతి

by Vinod kumar |
అదుపుతప్పి ఆటో బోల్తా.. ఒకరు మృతి
X

దిశ, కల్లూరు: జాతీయ రహదారిపై ఆటో అదుపు తప్పి బోల్తాపడగా ఒకరు మృతి చెందిన ఘటన స్థానిక ఖాన్ పేట గ్రామ సమీపాన చోటుచేసుకుంది. స్థానిక అంబేద్కర్ కాలనీకి చెందిన వాడపల్లి జోజి (47) తాపీ మేస్త్రిగా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజు మాదిరిగానే తన పనులు ముగించుకొని ఆటోలో కల్లూరు వస్తుండగా... సోమవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో జోజికి తలకు, ఛాతిపై గాయం కాగా వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతునికి భార్య విజయ ఒక కుమార్తె ఉన్నారు. ఆటో డ్రైవర్‌కి గాయాలు కాగా ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed