మహిళ మెడలో గొలుసు చోరీకి యత్నం

by Sridhar Babu |
మహిళ మెడలో గొలుసు చోరీకి యత్నం
X

దిశ, యాచారం : ఓ మహిళపై దాడి చేస్తూ గొలుసు చోరీకి యత్నించగా ప్రతిఘటించడంతో గ్రామస్తులు అప్రమత్తమై దొంగలను పట్టుకున్న సంఘటన మంగళవారం మొగుళ్ల వంపు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మొగుళ్లవంపు గ్రామానికి చెందిన చిప్పల పల్లి రజిత వ్యవసాయ బావి వద్దకు వెళ్తుండగా బైక్ పై ఇద్దరు వ్యక్తులు మహిళ ఇంటి నుంచి వెంబడించారు.

చౌదర్ పల్లి, కి వెళ్లే దారిలో దొంగలు ఓ కొత్త పారను కింద పడేసి ముందుకు వెళ్లారు. ఆ పారను మహిళ తీసుకొనగా అది మాది అని మహిళను ఏం మార్చి ఆ పారను తీసుకున్నట్లు నటించి మహిళపై దాడి చేస్తూ మేడలోంచి ముడున్నర తులాల బంగారు గొలుసు చోరీకి యత్నించారు. మహిళా గట్టిగా కేకలు వేయడంతో గ్రామస్తులు అప్రమత్తం అవుతుండడాన్ని గమనించి దొంగిలించిన గొలుసును ముళ్లపదలో పడేశారు. ఇద్దరు దొంగలను పట్టుకొని దేహశుద్ధి చేసి యాచారం పోలీస్ స్టేటన్ లో అప్పగించారు.

Advertisement

Next Story

Most Viewed