- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దారులన్నీ అయోధ్యవైపే.. రామమందిర ప్రారంభోత్సవాల నేపథ్యంలో వెలుస్తున్న సైన్ బోర్డులు
దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం దేశమంతా అయోధ్య గురించే మాట్లాడుకుంటోంది. ఈ నెల 22న రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో చాలా మంది అక్కడికి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు, యాత్రికులు తరలివచ్చే అవకాశం ఉండటంతో యూపీ గవర్నమెంట్ ఇప్పటికే ఏర్పాట్లలో నిమగ్నమై ఉంది. రీసెంట్‌గా పర్యాటకులకు ఇబ్బంది కలుగకుండా ఎక్కడికక్కడ లోకల్, నాన్ లోకల్, దేశీయ, అంతర్జాతీయ భాషల్లోనూ సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. మరో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే.. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో గల 22 భారతీయ భాషలతోపాటు ఐక్య రాజ్యసమితి కొత్తగా ఆమోదించిన మరో ఆరు భాషల్లోనూ సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారట.
సైన్బో ర్డులు ఏర్పాటు చేయడంతో అయోధ్యకు వచ్చే వివిధ ప్రాంతాలు, రాష్ట్రాలు, విదేశాలకు చెందిన యాత్రికులకు, భక్తులకు తాము వెళ్లాల్సిన ఏరియాల విషయంలో కన్‌ఫ్యూజన్ ఉండదని నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఇక ఇప్పటి వరకు హనుమాన్‌గర్హి, కనక్ భవన్, రామ్ కీ పైడి, అయోధ్య ధామ్ జంక్షన్, తేదీ బజార్, అయోధ్య ఎయిర్‌పోర్ట్‌తోపాటు పలుచోట్ల హిందీ, ఇంగ్లీష్‌లతోపాటు పలు ఇతర భాషల్లో సైన్ బోర్డులు వెలిశాయి. దీంతోపాటు నాగేశ్వర్ నాథ్ టెంపుల్, భజన్ సంధ్యా స్థల్ నయా ఘాట్, క్వీన్ హో పార్క్, లతా మంగేష్కర్ చౌక్, రామ్ పథ్, జన్మభూమి మార్గ్, భక్తిపథ్, ధర్మపథ్, చౌదరి చరణ్ సింగ్ ఘాట్, రామకథా మ్యూజియం, జానకీ మహల్, దశరథ్ మహల్, తులసి ఉద్యాన్, గోరఖ్‌పూర్-లక్నో బైపాస్, బైకుంత్ ధామ్, అయోధ్య ఐ హాస్పిటల్, అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్‌లలో వివిధ భాషల్లో సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. భాషల విషయానికి వస్తే.. చైనీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్, అరబిక్, హిందీ, ఉర్దూ, అస్సామీ, ఒరియా, కన్నడ, కాశ్మీరీ, కొంకణి, గుజరాతీ, డోగ్రీ, తమిళం, తెలుగు, నేపాలీ, పంజాబీ, బెంగాలీ, బోడో, మణిపురి, మరాఠీ, మైథిలి, మళయాళం, సంస్కృతం భాషల్లో సైన్ బోర్డులు వెలిశాయి.