- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సరయూ తీరంలో ఆధ్యాత్మిక సవ్వడి.. ‘జల్ కలష్ యాత్ర’తో సందడి
దిశ, నేషనల్ బ్యూరో : అయోధ్య ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. రామమందిరంలో రామయ్య విగ్రహమూర్తి ప్రతిష్టాపనోత్సవానికి సన్నాహకంగా రెండో రోజైన బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ‘జల్ కలష్ యాత్ర’ అయోధ్యకు చేరుకుంది. దాదాపు 500 మంది మహిళా భక్తులు యాత్రగా శ్రీరామ జన్మభూమికి చేరుకున్నారు. సరయూ ఘాట్ నుంచి ప్రారంభమైన జల్ కలష్ యాత్రలో కలశాన్ని తలపై మోస్తూ రాముడిని స్తుతిస్తూ మహిళలు ఊరేగింపుగా రామమందిరానికి వచ్చారు. గిరిష్ పట్టి త్రిపాఠి సతీమణి రామలక్ష్మీ త్రిపాఠి నేతృత్వంలో ఈ ఊరేగింపు జరిగింది. సరయూ నది నుంచి తీసుకొచ్చిన నీటితో గర్భగుడిని శుద్ధి చేయనున్నారు. దీనితో పాటు దేశ విదేశాల నదుల నుంచి తీసుకొచ్చిన నీటితో శుద్ధి చేసే కార్యక్రమం కూడా నిర్వహించనున్నారు. రామ మందిర ప్రారంభోత్సవ పూజా విధానం ప్రకారం బుధవారం బాల రామయ్య విగ్రహాన్ని ఆలయ ప్రాంగణానికి తీసుకెళ్లారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర్ ట్రస్టు నియమించిన అనిల్ మిశ్రా నేతృత్వంలో మంగళవారం ప్రారంభమైన ముడుపుల ఆచారాలు కొనసాగాయి.
ఒకరోజు ముందే అయోధ్యకు మోడీ
జనవరి 22న జరగనున్న ప్రాణ ప్రతిష్ట వేడుకల్లో ప్రధాన అతిథిగా ప్రధాని మోడీ పాల్గొననున్నారు. ప్రధాని మోడీ స్వయంగా ప్రధమ పూజ చేస్తారు. వాతావరణ పరిస్ధితుల నేపథ్యంలో ప్రధాని మోడీ అయోధ్య పర్యటన షెడ్యూల్‌లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. పొగమంచు కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున.. ఒక రోజు ముందే(జనవరి 21న) అయోధ్యకు మోడీ చేరుకుంటారని తెలిసింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే ఆలయంలో అన్ని పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు.