కరోనా తర్వాత కూడా వర్క్ ఫ్రమ్ హోమ్

by Harish |   ( Updated:2021-02-21 06:44:07.0  )
Azim Premji
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఐటీ పరిశ్రమలో 90 శాతం మంది శ్రామికశక్తి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నట్టు ఐటీ దిగ్గజం విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ చెప్పారు. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ తర్వాత నుంచి వీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారన్నారు. బెంగళూరు ఛాంబర్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ కామర్స్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, కరోనా ముగిసిన తర్వాత కూడా ఉద్యోగులు కొంత ఆఫీస్ నుంచి కొంత ఇంటి నుంచి పనిచేసే హైబ్రిడ్ మోడల్ కొనసాగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ హైబ్రిడ్ మోడల్ మెరుగైన ప్రయోజనాలను కలిగి ఉంటుందని, వృద్ధిని సాధించవచ్చని, ముఖ్యంగా మహిళలకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేందుకు వీలవుతుందని అన్నారు. అదేవిధంగా సరికొత్త టెక్నాలజీ వ్యక్తులతో పాటు వ్యాపారాలకు జీవనాధారంగా మారుతోందని అజీమ్ ప్రేమ్‌జీ తెలిపారు. దీనికి 2020 ఏడాది మంచి ఉదాహరణ అన్నారు. ప్రభుత్వ సామాజిక పథకాలు, సహాయ కార్యక్రమాలు ప్రజలకు చేర్చడంలో సాంకేతికత కీలకమైన పాత్ర పోషించింది. టైర్-2 నగరాల్లో డిజిటల్ మౌలిక సదుపాయాల లభ్యత అనేక వ్యాపారాల అభివృద్ధికి ఎంతో సహాయపడినట్టు ప్రేమ్‌జీ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed