శ్రీకాకుళం చేరుకున్న 889 మంది వలస కార్మికులు

by srinivas |

ఏపీకి రావాల్సిన శ్రామిక్ రైల్ కదిలింది. విశాఖపట్టణంలో చోటుచేసుకున్న దుర్ఘటనతో 9 శ్రామిక్ రైళ్లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తి నివారణకు విధించిన లాక్‌డౌన్ కారణంగా తమిళనాడులో చిక్కుకుపోయిన వలస కార్మికులను శ్రామిక్ రైల్ స్వస్థలానికి చేర్చింది. చెన్నై నుంచి 889 మంది వలస కార్మికులతో బయలుదేరిన శ్రామిక్ రైలు శ్రీకాకుళం చేరుకుంది.

వీరంతా వివిధ జీవన మార్గాలు వెతుక్కుంటూ పది నెలల క్రితం చెన్నై వలస వెళ్లారు. వీరిలో 635 మంది మత్స్యకారులు ఉండగా, భవన నిర్మాణ కార్మికులు, సెక్యూరిటీ గార్డులు తదితరులున్నారు. వారందన్నీ శ్రీకాకుళం రోడ్ జంక్షన్‌లో ట్రైన్ దించింది. సరుబుజ్జలి వెన్నెల వలస నవోదయ, శ్రీకాకుళం డెంటల్ కాలేజీ, చిలకపాలెం శివానీలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. ఈ ట్రైన్‌లోని విజయనగరం జిల్లాకు చెందిన 35 మందిని రెండు బస్సుల్లో ఆ జిల్లా కేంద్రానికి తరలించారు.

Advertisement

Next Story

Most Viewed