ఇండోనేషియాలో భూకంపం.. ఏడుగురి మృతి

by Anukaran |
ఇండోనేషియాలో భూకంపం.. ఏడుగురి మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : ఇండోనేషియాలో ఒక్కసారిగా భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై దాని తీవ్రతను 6.2 గా చూపిస్తుంది. భూకంపం దాటికి ఆ దేశంలో 60కు పైగా ఇళ్లు ధ్వంసం కాగా, ఏడుగురు మృత్యువాత పడ్డారు. వందలాది మందికి గాయాలు కాగా, ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మజేన్ నగరానికి ఈశాన్యంగా 6కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దాదాపు ఏడు సెకండ్ల పాటు భూమి కంపించడంతో జనాలు భయంతో బయటకు పరుగులు తీశారు.

Advertisement

Next Story