- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెకండ్ వేవ్‌లో అనాథలుగా మారిన 577 మంది పిల్లలు.. ఆదుకుంటామన్న కేంద్రం
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కుటుంబాలను అస్తవ్యస్తం చేసింది. పోషకులను పొట్టనబెట్టుకుని కొన్ని కుటుంబాలను రోడ్డు పాలుచేయగా, తల్లిదండ్రులనూ కబళించి పిల్లలను అభాగ్యులను చేసింది. దేశవ్యాప్తంగా సెకండ్ వేవ్‌లో అంటే ఏప్రిల్ 1 నుంచి ఈ నెల 25 వరకు ఇలా తల్లీ, తండ్రిని కాటేసి కరోనా 577 మంది పిల్లలను అనాథలుగా మార్చిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మహమ్మారి కాలంలో అయినవారే కానివారవుతున్న తరుణంలో అనాథలను ఆదుకోవాలని సోషల్ మీడియాలో మెస్సేజీలు పుట్టలుగా రావడంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది.
కరోనాతో తల్లిదండ్రులు మరణించి అనాథలైన పిల్లలను సంరక్షిస్తామని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి మంగళవారం మధ్యాహ్నానికి దేశవ్యాప్తంగా కరోనా కారణంగా 577 మంది పిల్లలు అనాథలుగా మిగిలారని వివరించారు. రాష్ట్రాలు, జిల్లా యంత్రాంగంతో కేంద్ర ప్రభుత్వం నిరంతర పర్యవేక్షణలో ఉన్నదని, అనాథల సంక్షేమం కోసం నిధుల కొరత లేదని పేర్కొన్నారు.