శిక్షణలో ఉన్న 14 మంది మహిళా పోలీసులకు పాజిటివ్?

by vinod kumar |   ( Updated:2022-08-22 10:06:57.0  )
శిక్షణలో ఉన్న 14 మంది మహిళా పోలీసులకు పాజిటివ్?
X

చెన్నైలోని కడలూర్‌ పోలీసు శిక్షణా కేంద్రంలో 14 మందికి మహిళా పోలీసులకు కరోనా పాజిటివ్‌ నిర్దారణ కావడంతో దానిని మూసివేశారు. తమిళనాడు రాజధాని చెన్నై తర్వాత అంతటి స్థాయిలో కడలూర్‌ జిల్లాలోనే కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. వివరాల్లోకి వెళితే.. కడలూర్‌ ఎస్పీ కార్యాలయ ప్రాంగణంలోని పోలీసు శిక్షణా పాఠశాలలో జిల్లా వ్యాప్తంగా ఎంపికైన మహిళా పోలీసులకు ఈ నెల 3వ తేదీ నుంచి శిక్షణ ఇస్తున్నారు. 9వ తేదిన వారికి కరోనా పరీక్షలు చేయగా 14 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో పాఠశాలను తాత్కాలికంగా మూసివేసి వారందరినీ చికిత్సకోసం చిదంబరం రాజా ముత్తయ్య వైద్య కళాశాలకు తరలించారు. మిగిలిన వారిని సమీపంలోని మండపంలో ఉంచి పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తోంది.అంతేకాకుండా వీరి ప్రైమరీ కాంటాక్ట్‌లను ఛేదించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

Advertisement

Next Story

Most Viewed