- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతులకు సూచనలు ఇవ్వండి: వేలేటి రోజా
దిశ, మెదక్: రైతులు అధిక దిగుబడులను సాధించేలా వ్యవసాయశాఖ అధికారులు సూచనలు చేయాలని సిద్దిపేట జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ అన్నారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో బుధవారం జరిగిన 2, 3, 4, 7వ స్థాయి సంఘ సమావేశాల్లో ఆమె మాట్లాడారు. తొలకరి వర్షాలు ప్రారంభం అవడం, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందుతున్న తరుణంలో రైతులు విత్తనాలు వేయడం మొదలుపెట్టారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో అధికారులు రైతులకు అందుబాటులో ఉంటూ.. ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా పంటలు వేసేలా చూడాలన్నారు. రసాయనిక ఎరువుల వినియోగాన్ని అవసరమైన మోతాదులో వాడేలా చూడాలని, సేంద్రియ ఎరువుల వినియోగం ఎక్కువగా జరిగేలా చొరవ చూపాలని చెప్పారు. అలాగే, లబ్ధిదారులకు రైతు బంధు డబ్బులు వారి బ్యాంకు ఖాతాలో జమ చేయాలన్నారు. రైతు వేదిక నిర్మాణాలను త్వరగా పూర్తి చేసి జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని రోజా రాధాకృష్ణ అధికారులకు సూచించారు.