జోయా.. జో దియా

by vinod kumar |
జోయా.. జో దియా
X

బాలీవుడ్ హీరోయిన్.. జోయా మొరానీ ‘ఆల్వేస్ కభీ కభీ, బాగ్ జానీ’ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత అకూరి, భూత్ పూర్వ లాంటి వెబ్ సిరీస్‌ల్లోనూ నటించిన ఈ బ్యూటీ.. తన అందంతో కుర్రాళ్లను ఫిదా చేసింది. చూడటానికి చాలా హాట్‌గా కనిపించే ఈ భామ.. తన మనసు మాత్రం చాలా స్వీట్ అని రుజువు చేసింది. కరోనా మహమ్మారి బారినపడి ఈ మధ్యే కోలుకున్న జోయా.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జయిన టైమ్‌లో చాలా హ్యాపీగా ఫీల్ అయిందట. తనను సురక్షితంగా ఇంటికి చేర్చిన వైద్యులకు రుణపడి ఉంటానని తెలిపింది.

కరోనా కారణంగా ఎందరో ప్రాణాలు కోల్పోతుండటం చూసి చలించిన జోయా.. ప్లాస్మాథెరపీ ట్రయల్స్ కోసం రక్తదానం చేసింది. తద్వారా ఐసీయూలో ఉన్న ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడటం చాలా సంతోషాన్నిచ్చిందని ట్విట్టర్‌లో పేర్కొంది. అయితే భారత్‌లో మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తుండగా.. తోటి మనుషులను కాపాడుకునేందుకు రెండోసారి కూడా ప్లాస్మాదానం చేసింది. కొవిడ్-19 నుంచి కోలుకున్న ప్రతీ ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని కోరింది. ‘మీరు చేసే ఈ సహాయం ఒక నిండు ప్రాణాన్ని నిలబెడుతుందన్న విషయం గుర్తుంచుకోవాలి’ అని జోయా తెలిపింది.

ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరీం మొరాని కూతురైన జోయా.. రెండోసారి ప్లాస్మా దానం చేయడంపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ హాట్ బ్యూటీ చాలా స్వీట్ అంటూ నెటిజన్లు పొగిడేస్తున్నారు. కాగా కరీం మొరాని షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనె జంటగా నటించిన చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్రాన్ని నిర్మించారు.

Advertisement

Next Story