వారికి అక్కడ చూడడం ఇంట్రెస్ట్ లేదు- హీరోయిన్

by Shyam |   ( Updated:2021-09-07 04:17:44.0  )
వారికి అక్కడ చూడడం ఇంట్రెస్ట్ లేదు- హీరోయిన్
X

దిశ, సినిమా : సెకండ్ వేవ్ ప్రభావం తగ్గిపోవడంతో దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో థియేటర్స్ తెరుచుకున్నాయి. దీంతో ఇన్నాళ్లుగా రిలీజ్ వాయిదాపడ్డ సినిమాలన్నీ బిగ్ స్క్రీన్‌పై ప్రదర్శనకు సిద్ధమవుతుండగా, కొన్ని మాత్రం ఓటీటీ బాటపడుతున్నాయి. ఇక కొవిడ్-19 క్రైసిస్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ పంచడమే కాకుండా ఫ్రెష్ టాలెంట్‌ను పరిచయం చేయడంలోనూ ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ప్రముఖ పాత్ర పోషించాయి. ఈ నేపథ్యంలోనే నటి జరీనా ఖాన్ ఓటీటీని చాలా పవర్‌ఫుల్ మీడియంగా నమ్ముతానంటోంది. ‘గతేడాది లాక్‌డౌన్ టైమ్‌లో ఎక్కువమందికి ఓటీటీ గురించి తెలియదు, కానీ ఇప్పుడు అందరికి తెలిసింది. ప్రేక్షకులకు వినోదాన్ని పంచడంలో అతిపెద్ద వనరుగా మారింది’ అని ఈ 34 ఏళ్ల నటి తెలిపింది. లేటెస్ట్‌గా తను నటించిన ‘హమ్ భీ అకేలే తుమ్ భీ అకేలే’ మూవీ ఓటీటీలోనే రిలీజైంది.

ఇక ప్రజెంట్ సిచ్యువేషన్‌ను వివరిస్తూ.. ‘హెల్త్ గురించి ఆందోళన చెంది ప్రేక్షకులు థియేటర్‌లో సినిమా చూసేందుకు సిద్ధంగా లేరు. కొందరు ఆడియన్స్‌తో ఇంటరాక్ట్ అయినప్పుడు వారు కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇది విచారకరమైన విషయం. కానీ నేను నా సినిమాలను థియేటర్లలో విడుదల చేయడానికే ఇష్టపడతాను’ అని చెప్పుకొచ్చింది. అయితే ఓటీటీలో నచ్చినపుడు చూసే ఫెసిలిటీ ఉండటం వారిని అటువైపుగా అట్రాక్ట్ చేస్తోందని, ఇది విప్లవాత్మక మార్పు అని అభిప్రాయపడింది.

Advertisement

Next Story