‘‘భద్రతలో మార్పులు లేవు’’

by srinivas |   ( Updated:2020-02-18 22:15:42.0  )

టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కల్పిస్తున్న భద్రతలో ఎలాంటి మార్పులు జరగలేదని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. దేశంలోనే ఏ ప్రతిపక్ష నాయకుడికీ లేనంతగా అత్యంత హై సెక్యూరిటీని చంద్రబాబుకు కల్పిస్తున్నామన్నారు. జెడ్‌ప్లస్ సెక్యూరిటీ భద్రత ఆయనకు ఉందన్నారు. సెక్యూరిటీ రివ్యూ కమిటీ నిర్ణయం మేరకు భద్రతలో మార్పులు చేర్పులు చేయలేదని తెలిపారు. ప్రస్తుతం 183మందితో భద్రత కల్పిస్తున్నామన్నారు. విజయవాడలో 135మంది, హైదరాబాద్‌లో 48మందితో భద్రత కొనసాగుతోందని గౌతం సవాంగ్ అన్నారు.

కల్వర్టును ఢీకొన్న బైక్.. ఒకరు మృతి

Advertisement

Next Story