హత్యకు గురైన వైఎస్సార్సీపీ నేత

by srinivas |   ( Updated:2020-06-29 03:33:18.0  )
హత్యకు గురైన వైఎస్సార్సీపీ నేత
X

దిశ, ఏపీ బ్యూరో: కృష్ణా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మచిలీపట్నంలో వైఎస్సార్సీపీ నేత మోకా భాస్కర్‌ రావు దారుణ హత్యకు గురయ్యారు. మున్సిపల్‌ చేపల మార్కెట్‌లో ఉన్న ఆయనపై కత్తులతో గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. పక్కా ప్లాన్‌ ప్రకారం సైనేడ్‌ పూసిన కత్తితో భాస్కర్‌ రావును హత్య చేశారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు యువకులు పాల్గొన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వారిద్దరూ టీడీపీ మాజీ కౌన్సిలర్‌ అనుచరులుగా అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Next Story