వివేకా హత్య కేసులో కీలక మలుపు.. వైఎస్‌ అవినాష్‌‌రెడ్డి సన్నిహితునికి నార్కో పరీక్షలు

by srinivas |
ys viveka
X

దిశ, ఏపీ బ్యూరో : మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో మళ్లీ సీబీఐ దూకుడు పెంచింది. ఇటీవలే మరో దఫా విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా మంగళవారం పులివెందుల కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గత నెలలో అరెస్ట్ చేసిన కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి సన్నిహితుడు శివశంకర్‌రెడ్డికి నార్కో పరీక్షల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని పిటిషన్‌లో సీబీఐ కోరింది. సీబీఐ పిటిషన్‌ను పులివెందుల కోర్టు విచారణకు స్వీకరించింది. నార్కో పరీక్షల కోసం త్వరలోనే శివశంకర్‌రెడ్డి సమ్మతిని కోర్టు కోరనున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కడప జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని సీబీఐ హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుంది. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి పులివెందులకు తరలించారు.. కోర్టులో హాజరుపరచగా ధర్మాసనం ఆయనకు రిమాండ్ విధించింది. దీంతో శివశంకర్ రెడ్డి రిమాండ్‌లో ఉన్నారు. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై పులివెందుల కోర్టు మంగళవారం తీర్పు వెల్లడించనుంది. ఇలాంటి తరుణంలో సీబీఐ నార్కో పరీక్షల కోసం కోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed