- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ నయవంచకుడు కేసీఆర్: వైఎస్ షర్మిల
దిశ, కోస్గి: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రంలోని అన్ని వర్గాలకు స్థానం, అభివృద్ధి కలుగుతుందని ఆశించిన తెలంగాణ ప్రజలు కేసీఆర్ నయవంచన పాలనలో పూర్తిగా నలిగిపోయారని వైఎస్ షర్మిల అన్నారు. ఆదివారం నారాయణపేట జిల్లా కోస్గి పట్టణ కేంద్రంలో నిర్వహించిన బీసీ ఆత్మ గౌరవ సభలో వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీసీల అభివృద్ధి పేరుతో వారి వెనుకబాటుకు పునాదులు వేసిన నాయకుడు కేసీఆర్ అని విమర్శించారు. ఇలాంటి నాయకుడిని నమ్మడం మనందరి మూర్ఖత్వమన్నారు. పూటకో మాట మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను నట్టేట ముంచిన నాయకుడు కేసీఆర్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచం ఓ వైపు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దూసుకుపోతుంటే కుల వృత్తుల పేరుతో గొర్రెలు-బర్రెలంటూ అన్ని వర్గాల అభివృద్ధికి అడ్డంగా మారరని షర్మిల సెటైర్లు వేశారు. చట్టసభల్లో జనాభా ప్రాతిపదికన బీసీ వర్గాలకు సముచిత స్థానం కల్పించినప్పుడే ఆ వర్గాల ప్రజల అభివృద్ధితో పాటు నిజమైన పాలన చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. కేసీఆర్‌కు బీసీలు అంటే బానిసలుగా మారారని, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధికారంలోకి వస్తే బీసీలను సమాజానికి బ్యాక్ బోన్‌గా మారుస్తానని హామీ ఇచ్చారు. ట్యాంక్ బండ్ పై ఉన్న బీసీ మహానుభావుల విగ్రహాలను ప్రతిష్టించి వారి ఆత్మలకు శాంతి చేకూరుస్తామని షర్మిల చెప్పారు. బీసీల బతుకులు బాగు పాడాలంటే వారే పాలకులు కావాలన్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ నేతల ఆగడాలను ప్రశ్నించే ప్రతిపక్ష పార్టీలు లేవని ఆ లోటును వైఎస్సార్ టీపీ తీరుస్తుందని షర్మిల చెప్పారు. అనంతరం తెలంగాణ వైఎస్సార్ టీపీ ఈ వెబ్‌సైట్‌ను ఆమె ప్రారంభించారు.