- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారికి పోస్టింగ్ ఇవ్వండి.. సీఎస్ మెయిల్ పెట్టిన షర్మిల
దిశ, తెలంగాణ బ్యూరో : సెలక్ట్ అయి పోస్టింగ్‌ల కోసం ఎదురు చూస్తున్న వారికి స్టాఫ్ నర్సు పోస్టులు ఇప్పించాలని వైఎస్ షర్మిల కోరారు. శుక్రవారం ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌కు మెయిల్ ద్వారా వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 2017 సెప్టెంబర్ 9న 3311 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ విడుదల చేసిందని, 2018లో పరీక్ష నిర్వహించగా 2021 ఫిబ్రవరిలో ఫలితాలను విడుదల చేసిందని తెలిపారు. కటాఫ్ మార్కుల ఆధారంగా 3170 మంది అర్హత సాధించారని, ఈ ఏడాది మార్చిలో 3076 మంది సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేసి ఉద్యోగార్హత పొందిన వారంతా వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలని కమిషన్ తెలిపిందన్నారు. అనంతరం 2418 మందిని మాత్రమే ఎంపిక చేసి, మిగతా 658 మందిని ఎలాంటి కారణాలు లేకుండా పక్కన పెట్టిందని ఆరోపించారు. ఉద్యోగాలు ఇవ్వాలని ఇప్పటికే వారంతా టీఎస్పీఎస్సీ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేదన్నారు. కరోనా సమయంలో స్టాప్ నర్సుల సేవలను వినియోగించుకోకుండా వారిని పక్కన పెట్టడం సరికాదన్నారు. ఇప్పటికైనా చొరవ తీసుకొని 658 మందికి తక్షణమే స్టాప్ నర్సు పోస్టులు ఇప్పించాలని సీఎస్‌ను కోరారు.