- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఉద్యోగిపై యువతుల వలపు వల.. 15 రోజుల్లోనే అంతా..
దిశ, ఉత్తరాంధ్ర : సైబర్, ఆల్‌లైన్ మోసాలపై పోలీసులు ఎంత అవగాహన కల్పించినా.. ప్రజల్లో సరైన మార్పు రావడం లేదు. ముఖ్యంగా విద్యావంతులు, ఉద్యోగులు సైతం సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కి మోసపోతున్నారు. అమ్మాయిల మాటల మత్తులో మునిగి.. ఉన్న డబ్బంతా ఊడ్చిపెడుతున్నారు. బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ అయ్యాక.. వారి తీపి మాటల వెనక ఉన్న చేదు అర్ధమై పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే విశాఖ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
వి.రవిప్రసాద్‌గుప్తా అచ్యుతాపురం సెజ్‌లోని ఓ కంపెనీలో ఉన్నత ఉద్యోగం చేస్తున్నాడు. ఆయనకు నాలుగు నెలల క్రితం ఫేస్‌బుక్‌లో క్లారా మోర్గాన్ అనే యువతి పరిచయం అయింది. తాను లండన్‌కు చెందిన యువతినని మాటలు కలిపింది. అలా ఇద్దరు ఫేస్‌బుక్‌లో ఛాటింగ్ చేసుకునే వారు. ఈ క్రమంలో తాను ఇండియాకు వస్తున్నట్లు క్లారా మోర్గాన్ ఫ్లైట్ టికెట్‌ను రవిప్రసాద్‌గుప్తాకు పంపించింది. అలాగే తన దగ్గర 5,32,000 పౌండ్ల డీడీ ఉన్నదని గుప్తాను నమ్మించింది.
ఈక్రమంలో ఢిల్లీ విమానాశ్రయంలో ఇమిగ్రేషియన్ క్లియరెన్స్ కోసం రూ.68,500 అవసరమని కోరింది. ప్రియంకా అనే మరో యువతి గుప్తాకి ఫోను చేసి తాను ఇమిగ్రేషియన్ అధికారిణి అని.. క్లారా మోర్గాన్‌కు ఇమిగ్రేషియన్ క్లియరెన్స్ కోసం నగదు అవసరమని చెప్పడంతో రవిప్రసాద్‌గుప్తా 30 సార్లు రూ.27.20 లక్షల నగదును బ్యాంకు ఖాతాకు పంపించారు. ఇదంతా ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 14 వరకు జరిగింది.
ఆ తరవాత ఇద్దరి యువతుల ఫోన్లు స్వీచ్ ఆఫ్ రావడంతో గుప్తాకి అనుమానం వచ్చింది. ఫేస్‌బుక్, మెసేంజర్ ఖాతాలు పనిచేయకపోవడంతో మోసపోయానని తెలుసుకొని అచ్యుతాపురం పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్ఐ ఉపేంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇలా ఫేస్‌బుక్ ద్వారా పరిచయమై అపరిచిత యువతులు విసిరిన వలలో సెజ్ ఉద్యోగి మోసపోయి రూ.27 లక్షలపైనే పోగొట్టుకున్నాడు. అపరిచిత ఫోన్ కాల్స్, ఫ్రెండ్ షిప్ మంచిది కాదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.