నన్ను ప్రేమించి.. ఆమెతో పెళ్లేంటీ..?

by Shyam |
నన్ను ప్రేమించి.. ఆమెతో పెళ్లేంటీ..?
X

దిశ, వరంగల్: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసగించి మరో యువతితో వివాహం నిశ్చయం చేసుకున్న ‌ప్రియుడి ఇంటి ఎదుట బాధితురాలు ఆందోళనకు దిగిన సంఘటన వరంగల్ నగరంలోని శివానగర్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సిద్ధిపేటకు చెందిన దీప్తి హన్మకొండలో ఎల్ఎల్బీ చదువుతూ హాస్టల్‌ లో ఉంటోంది. ఈ క్రమంలో ఆమెకు వరంగల్ శివనగర్ కు చెందిన వీరన్నతో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో దీప్తి తరచుగా వీరన్న ఇంటికి రాకపోకలు సాగిస్తోంది. కాగా, ఆదివారం వీరన్న వేరొక యువతితో వివాహం నిశ్చయం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న దీప్తి సోమవారం ఉదయం వీరన్న ఇంటికి వచ్చి ఆందోళనకు దిగింది. తనకు న్యాయం జరిగే వరకూ ఆందోళన విరమించేది లేదంటూ ఇంటి ఎదుట బైటాయించింది. సమాచారం మేరకు మిల్స్ కాలనీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

Advertisement

Next Story