- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రేమోన్మాది వేధింపులు తాళలేక…చివరికి..!
దిశ, మహబూబాబాద్ : జిల్లాలోని బయ్యారం మండలంలో సాంభతండా గ్రామపంచాయితీ శివారు పాత్యాతండాకు చెందిన ధరంసోత్ సునీత (21) అనే యువతిని అదే తండాకు చెందిన యువకుడు ప్రేమించానని వెంట బడుతూ నానా ఇబ్బందులకు గురి చేస్తుండగా మనస్తాపంతో ఆదివారం బలవన్మరణానికి పాల్పడింది. గ్రామస్తులు, మృతురాలి బంధువులు తెలపిన వివరాల ప్రకారం… పాత్యా తండాకు చెందిన మాళోత్ శివ, సునీతా ఇద్దరు ఒకే కాలేజ్‌లో చదువుకున్నారని తెలిపారు. కరోనా నేపథ్యంలో సునీత ఇంటికి వచ్చినప్పటినుండి శివ మానసికంగా వేధింపులకు గురి చేశాడని, మృతురాలి తల్లిదండ్రులు శివను మందలింగా వారిని చంపాలని నిర్ణయించి పలు మార్లు బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపించారు. కొద్దిరోజుల క్రితం సునీతను కిడ్నాప్ చేయగా చెరనుండి తప్పించుకున్నట్లు తెలిపారు.
శివ, అతని బంధువులపై పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా..పట్టించుకోలేదని ఆరోపించారు. తనకు న్యాయం చేసేందుకు దిక్కు ఎవ్వరూ లేరని నాలుగు పేజీల సూసైడ్ నోట్ రాసి తన నివాస గృహంలో ఫ్యాన్‌కు ఉరి వేసికొని ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై ఎస్సై జగదీష్ నలుగురు యువకులను కస్టడీలోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతురాలి బంధువులు బయ్యారం మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఎదురుగా ఎస్సైకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాస్తారోకో ధర్నా నిర్వహించారు. ఈ విషయం జిల్లా ఎస్పీ కోటిరెడ్డికి దృష్టికి వెళ్లడంతో విచారణ నిమిత్తం బయ్యారం పోలీస్ స్టేషన్ కు ఏఎస్పీ యోగేష్ గౌతమ్ పంపించి సమస్యను సద్దుమణిగించారు. యువతికి జరిగిన అన్యాయంపై దర్యాప్తు చేపట్టి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని వారికి హమీ ఇచ్చారు.