వీళ్లు మనుషులా.. కామంతో ఓ వైపు చిన్నాన్న, మరో వైపు అన్నయ్య.. చివరికి

by Anukaran |   ( Updated:2021-08-20 10:21:22.0  )
వీళ్లు మనుషులా.. కామంతో ఓ వైపు చిన్నాన్న, మరో వైపు అన్నయ్య.. చివరికి
X

దిశ, నేరేడుచర్ల : ఇద్దరు కూతుర్లను అనాథలు చేసి, కన్నవారు కానరాని లోకాలకు పోతే.. అనాథలైన ఆ అక్కాచెల్లెళ్లను సహృదయంతో దత్తత తీసుకున్నా.. ఓ యువతి ఇంట్లోని మృగాళ్ల చేతిలో నరకయాతన చూసి చివరికి తిరిగిరాని లోకాలకు వెళ్లిన హృదయ విదారణ ఘటన నేరేడుచర్ల మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై విజయ్ ప్రకాష్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఫత్తేపురం గ్రామానికి చెందిన పగిడిమర్రి సైదులు, సాలమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతరు అనూష, చిన్న కూతురు సుధా. కూతుర్ల చిన్న తనంలోనే తల్లి సాలమ్మ అనారోగ్యంతో మృతి చెందింది.

దీంతో తండ్రి సైదులు మరో వివాహం చేసుకున్నా కొద్దిరోజులకే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు చిన్నారులు దిక్కులేని వారైనారు. ఫత్తేపురం గ్రామానికి చెందిన సైదులు పెద్ద అన్న పగిడిమర్రి నగేష్ అనూషను దత్తత తీసుకున్నాడు. చిన్న కూతురు సుధాను నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం చెరుకుపల్లి గ్రామానికి చెందిన బోస్కా వెంకన్న, మర్తమ్మ దంపతులు దత్తత తీసుకున్నారు. చిన్న కూతరు సుధాను పెంచి పెద్ద చేసి అదే గ్రామానికి చెందిన పర్పుల రవికి ఇచ్చి వివాహం జరిపించారు.

ఇదిలా ఉండగా.. సొంత బాబాయి పగిడిమర్రి విజయ్ అనూషను లైంగికంగా వేధించడంతో పాటు లోబర్చుకోని కడుపు చేయగా మూడు నెలల గర్భం దాల్చించి. ఈ విషయం తెలిసిన అనూష పెద్దమ్మ గర్భం తీయించింది. పెంచి పెద్ద చేసిన నగేష్ కుమారుడు, వరసకు అన్నయ్య అయిన అంజి సైతం అనూషను అసభ్యకరంగా, లైంగికంగా వేధించేవాడు. వివాహం చేయాలనే ఆలోచన లేకుండా వేధిస్తుండడంతో మనోవేధనకు గురైన అనూష, ఈ నెల 14న పొలం నాట్లకు వెళ్లి ఇంటికి వచ్చిన తరువాత కలుపు మందు సేవించింది. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. ఈ ఘటనపై మృతురాలి చెల్లెలు సుధా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసికొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అనూష మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజూర్‌నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై వెల్లడించారు.

యువకుడిని మత్తులోకి దింపిన ఒకే అమ్మాయి.. మూడు గొంతులు, మూడు పాత్రలు!

ప్రభుత్వ వైద్యుడి పైశాచికత్వం.. బాతురూంలో నర్స్ నగ్న వీడియోలు తీసి.

Advertisement

Next Story