మానవత్వం పరిమళించిన వేళ.. కరోనా శవానికి అంత్యక్రియలు…

by Sumithra |
మానవత్వం పరిమళించిన వేళ.. కరోనా శవానికి అంత్యక్రియలు…
X

దిశ, మిర్యాలగూడ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి కరోనా సోకి మృతి చెందగా స్థానిక ముస్లిం యువకులు హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరిపి మానవత్వం చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. పట్టణానికి చెందిన గునుగుంట్ల మహేష్ (34) ఓ సాప్ట్ వేర్ కంపెనీ ఉద్యోగి. వర్క్ ఫ్రమ్ హోమ్ లో భాగంగా ఇంటినుంచే విధులు నిర్వర్తిస్తూ కరోనా బారినపడి మంగళవారం మృతి చెందాడు. దహన సంస్కారాలు చేసేందుకు కుటుంబసభ్యులు, బంధువులు ముందుకు రాకపోవడంతో టీఆర్ఎస్ నేత నాగార్జునచారి, మైనార్టీ ప్రతినిధి సాజిద్ ఖాన్‌ల చొరవతో గయాస్ యూత్ సభ్యులు హిందూ సంప్రదాయం ప్రకారం మహేష్ అంత్యక్రియలు నిర్వహించారు.

పీపీఈ కిట్లు ధరించిన ఎండి గయాస్, ఉబేద్, జహంగీర్, ఖదీర్, జుబెర్, బషీర్, సాజిద్, ఇమ్రాన్, యూనస్ లు మహేష్ మృత దేహాన్ని శ్మశానానికి చేర్చి అంతిమ సంస్కారం చేశారు. ఇస్లాం బోధనల ప్రకారం అంత్యక్రియల నిర్వహణ విధిగా భావించిన ముస్లిం యువత కరోనా మృతునికి అంత్యక్రియలు నిర్వహించడం పట్ల మహేష్ కుటుంబ సభ్యులు, పట్టణ ప్రజలు, నాయకులు ముస్లిం యువకులకు అభినందనలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed