గర్భవతిని చేసి.. ముఖం చాటేసి..

by Sumithra |
గర్భవతిని చేసి.. ముఖం చాటేసి..
X

దిశ, వెబ్‌డెస్క్: ముందు ప్రేమ అన్నాడు.. నువ్వు లేక నేను లేనన్నాడు. తీరా పెండ్లి చేసుకున్నాక నువొద్దు పో అన్నాడు. ఇంట్లో వాళ్లని వదిలేసి అతడిపై నమ్మకంతో వచ్చిన యువతిని నడి సముద్రంలో ముంచాడు. ఏకంగా గర్భందాల్చిన తర్వాత మోహం చాటేయడానికి యత్నించిన యువకుడిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

వివరాళ్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన వడ్ల అఖిల్ ప్రేమ పేరుతో ఓ యువతిని లొంగదీసుకున్నాడు. తొలిరోజుల్లో ఎంతో ప్రేమను చూయించాడు. అతడి కపట ప్రేమను తెలుసుకోలేక పోయిన యువతి నమ్మి తన సర్వస్వం ఇచ్చేసింది. అనంతరం అతడితో కలిసి జీవించాలనుకుంది. దీంతో ఆ అఖిల్ దొంగ చాటుగా పెండ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెను ఓ హాస్టల్‌‌లో ఉంచాడు. తాను గర్భం దాల్చడంతో ఈ విషయం అఖిల్‌కు చెప్పి ఇంటికి తీసుకెళ్లమని ఒత్తిడి చేసింది.

దీంతో చేసేదేమి లేక అఖిల్ షాద్‌నగర్‌లోని ఓ రూమ్ అద్దెకు తీసుకొని కాపురం సాగిస్తున్నాడు. అయితే, మెల్లమెల్లగా ఆమెకు దూరం అవడం మొదలుపెట్టాడు. ఇది ఏంటని బాధితురాలు నిలదీయడంతో ఎదురుతిరిగాడు. దాడి చేయడానికి యత్నించాడు. దీంతో మోసపోయానని గ్రహించిన యువతి దిక్కుతోచని స్థితిలో పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story