కిలికి భాషకు లిపి

by Shyam |
కిలికి భాషకు లిపి
X

బాహుబలి… గ్రాండ్ సెట్స్, హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్సులు, అద్భుతమైన వీఎఫ్ఎక్స్, రికార్డ్ బ్రేకింగ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్.. ఇవి బాహుబలి గురించి మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నమాటలు. కానీ, ఈ అద్భుత ఘట్టం మరో ఘట్టానికి నాంది పలికింది. ఏకంగా ఓ భాషాసృష్టికి పునాది వేసింది.

బాహుబలి… మాహిష్మతి సామ్రాజ్యానికి, కాలకేయులకు మధ్య జరిగే మహా యుద్ధం. ఈ కాలకేయులు సినిమాలో మాట్లాడే భాషే కిలికి. సినిమా కోసం క్రియేట్ చేసిన ఈ లాంగ్వేజ్‌కు లిపిని కూడా సృష్టించాడు రచయిత మదన్ కార్కి. కికి వాల్డ్‌నే క్రియేట్ చేసి నూతన భాషకు ఊపిరి పోశాడు. 3000కు పైగా పదాలు, వ్యాకరణంతో ప్రపంచంలోనే చిన్నదైన, సులభమైన భాషకు ప్రాణం పోశాడు. ఈ భాషను నేర్చుకోడం కోసం (kiliki.in) వెబ్‌సైట్, యాప్‌ను కూడా ప్రవేశపెట్టారు. సైట్‌లోకి వెళ్లి ఇంగ్లీష్‌లో పేరు టైప్ చేస్తే చాలు, కిలికి భాషలో ఆ పేరు ప్రత్యక్షమవుతుంది.

కిలికి భాష సృష్టికర్త మదన్ కార్కిని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు బాహుబలి దర్శకుడు రాజమౌళి. మదన్ కార్కి పరిశోధనకు సలాం చేశారు. మీరు అందరు కూడా కిలికి భాష(బాహుబలి భాష)ను నేర్చుకోవచ్చని ట్వీట్ చేశారు. కిలికి భాషను ప్రపంచానికి పరిచయం చేస్తున్న మదన్‌ కార్కిని బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ కీర్తించాడు. మీరు నిర్విరామంగా పనిచేసి కనిపెట్టిన భాషను ఇప్పుడు అందరు కూడా నేర్చుకోబోతున్నారని, మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉందని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

Advertisement

Next Story